సుకుమార్ పై సమంత ప్రభావం!
రామ్ చరణ్-సమంత జంటగా సుకుమార్ తెరకెక్కించిన `రంగస్థలం` ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే.
రామ్ చరణ్-సమంత జంటగా సుకుమార్ తెరకెక్కించిన `రంగస్థలం` ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఏకంగా 200కోట్లకు పైగా వసూళ్లని సాధించింది చిట్టిబాబు గా రామ్ చరణ్... రామ లక్ష్మిగా సమంత పాత్రలు ఎంతో గొప్పగా పండాయి. ఆ రెండు పాత్రల మధ్య కెమిస్ట్రీ ఎంతో చక్కగా పండింది. వాళ్లు అంత గొప్ప పెర్పార్మెన్స్ ఇవ్వగలిగారు. పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్రలో సమంత ఆహార్యం..నటన ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చాయి.
ఆ పాత్రకు కేవలం సమంత మాత్రమే న్యాయం చేసే నటి అని అంతా భావించారు. కానీ వాస్తవానికి ఆ పాత్రని సుకుమార్ సృష్టించింది మాత్రం ఓ కొత్త నటికి అన్న సంగతి వెలుగులోకి వచ్చింది. తొలుత ఈ పాత్రని రాసింది ఓ కొత్త నటి కోసమట. సెట్స్ లో ఇద్దరు స్టార్లు సుకుమార్ కి మ్యానేజ్ చేయడం కష్టమవుతుందని భావించి కొత్త నటి అయితే ఇబ్బంది ఉండదని అనుకున్నారుట. ఈ విషయం స్వయంగా సుకుమార్ రివీల్ చేసారు. `రంగస్థలం`లో చరణ్ నటన అద్భుతం.
చరణ్ ను దృష్టిలో పెట్టుకునే కథను రాసాను. హీరోయిన్ పాత్రను మాత్రం సమంత కోసం రాయలేదు. కానీ కథ ప్రకారం మంచి ఆర్టిస్ట్.. తెలుగు తెలిసిన హీరోయిన్ కావాలి. అప్పుడే సమంత అయితే బెటర్ గా ఉంటుంద నిపించింది. షూటింగ్ సమయంలో సమంత నటన చూసి ఆశ్చర్యపోయాను. ప్రతి సన్నివేశంలో సమంత అద్భుతమైన హావభావాలను ప్రదర్శించింది. అప్పుడే నేను బలమైన నిర్ణయం తీసుకున్నాను. నేనే సినిమాలు తీసినంత కాలం సమంతతో చేస్తూనే ఉంటాను` అని తెలిపారు.
అలా సమంత తన నటనతో సుకుమార్ ని ఆకట్టుకుంది. సుకుమార్ లాంటి క్రియేటివ్ మేకర్ తో గ్రేట్ పెర్పార్మర్ అనిపించుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఆ పాత్ర ప్రభావం దర్శకుడిపై తీవ్రంగా ఉంటే తప్ప అంతటి అభిమానం చూపించడం అన్నది సాధ్యం కాదు. తొలి నాళ్లలో సమంతకి సరైన నటన రాదని విమర్శలు ఎదుర్కున్న నటినే. కాల క్రమంలో నటనలో తనకంటూ ఓ ప్రత్యేక శైలి ఉందని నిరూపించుకుంది.