బెయిల్ పై ఉన్న నటుడిపై సుమలత ఆసక్తికర వ్యాఖ్యలు!
ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ రేణుకాస్వామి మర్డర్ కేసులో అరెస్ట్ అవ్వడం.. మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ రేణుకాస్వామి మర్డర్ కేసులో అరెస్ట్ అవ్వడం.. మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 150 రోజుల తర్వాత అనారోగ్యం కారణంగా ఈ బెయిల్ కోర్టు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆసుపత్రిలో వెన్నుకు సంబధించిన చికిత్స తీసుకుంటున్నాడు. ఆరు వారాల తర్వాత మళ్లీ యధా విధిగా బళ్లారి జైల్లో సరెండ్ అవ్వాల్సిందే. తాజాగా దర్శన్ తో తనకున్న అనుబంధాన్ని సీనియర్ నటి సుమలత మరోసారి పంచుకున్నారు.
`దర్శన్ నాకు ఎప్పటికీ కుమారుడు లాంటి వాడేనన్నారు. దర్శన్ భార్య విజయలక్ష్మి తో రోజూ మాట్లాడుతూనే ఉన్నాను. శస్త్రచికిత్స కు దర్శన్ నిరాకరిస్తుండటంతో వెన్ను నొప్పి నుంచి బయట పడేందుకు మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందదని` సుమలత తెలిపారు. దర్శన్ అరెస్ట్ అయిన వెంటనే సుమలత స్పందించిన సంగతి తెలిసిందే. దర్శన్ పై తన నమ్మకాన్ని వ్యక్త చేస్తూ మద్దతు ప్రకటించారు.
ఎలాంటి తప్పు చేసి ఉండడని, నిర్దోషిగా బయటకు వస్తాడని ధీమా వ్యక్తం చేసారు.అలాగే నేరుగా దర్శన్ ని పరప్పన్ అగ్రహారం జైల్లో ఉన్న సమయంలో సుమలత ములాఖత్ కూడా అయ్యారు. దర్శన్ ని పరామర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తనవైపు నుంచి అన్ని రకాల సహకారం ఉంటుందని భరోసా కల్పించారు. యశ్..దర్శన్ అంటే సుమలత బిడ్డల్లా భావిస్తారు.
సుమలత రాజకీయ ప్రయాణం వెనుక ఆ ఇద్దరు స్టార్లు ఎంతో కీలక పాత్ర పోషించారు. అలా ఆ ముగ్గురికి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఓ సందర్భంలో దర్శన్ , సుమలత తన తల్లిలాంటిదని, ఆమె గీసిన గీతను జవదాటనని, బావిలోకి వెళ్లి దూకమని ఆమె చెప్పినా ఎందుకు అని అడగకుండా ఆ పని చేస్తానన్నాడు.