తెర మీద ఏం చేయలన్నది ఎన్టీఆర్ కు బాగా తెలుసు..!

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా మరో 10 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Update: 2024-09-17 06:46 GMT

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా మరో 10 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఇప్పటికే భారీ హైప్ తో ట్రెండింగ్ లో ఉంది. సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తుంది. ఐతే దేవర కి బూస్టింగ్ ఇచ్చేలా ఒకప్పటి హీరో ప్రస్తుతం విలన్ ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న సుమన్ చేసిన కామెంట్స్ హడావిడి చేస్తున్నాయి. ఎన్టీఆర్ గురించి సుమన్ తన మార్క్ కామెంట్ చేసి ఫ్యాన్స్ ని అలరించారు.

ఎన్టీఆర్ దేవర గురించి మాట్లాడిన సుమన్ ఆయన చాలా అదృష్టవంతుడని అన్నారు. రిలీజ్ కు ముందే ఇన్ని రికార్డులు సృష్టించడం మాటలు కాదని అన్నారు. ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్సర్ ఐలాగ్ చెప్పడంలో కూడా అతను మాస్టర్. ఫైట్స్ మీద కూడా మంచి అవగాహన ఉంది. ఎంతో అంకితభావంతో పనిచేస్తాడు. అందరితో స్నేహంగా ఉంటడని. తెరపై ఏం చేయాలన్నది తారక్ కి బాగా తెలుసని అన్నారు సుమన్.

ఎన్టీఆర్ దేవర పై సుమన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఇదిలా ఉంటే దేవర సినిమా పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేస్తుంది. పుష్ప 2 కోసం బుక్ మై షోలో 3.34 లక్షల మంది ఆసక్తి కనబరచగా.. దేవర కోసం 3.36 లక్షల మంది ఇంప్రెషన్ చూపించారు. దేవర సినిమాపై ఉన్న బజ్ ఏంటన్నది బుక్ మై షో బజ్ చూస్తే అర్ధమవుతుంది.

దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జతగా జాన్వి కపూర్ నటించింది. సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడిగా నటించారు. ఎన్ టీ ఆర్ అయితే ఈ సినిమా ఫ్యాన్స్ అందరికీ కాలర్ ఎగరసేలా చేస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. మరి దేవర పార్ట్ 1 ఆశించిన ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఓవర్సీస్ లో అయితే దేవర క్రేజ్ తెలుగు రాష్ట్రాలకు ఈక్వల్ గా ఉంది. నార్త్ అమెరికాలో అయితే దేవరకు 1.5 మిలియన్ ప్రీ బుకింగ్ కలెక్షన్స్ తో అదరగొడుతున్నాయి.

Tags:    

Similar News