థియేటర్ క్లోజ్ చేస్తే 4 వేలు..తీస్తే 6 వేలు నష్టం!
తాజాగా ఈ పరిస్థితిని ఉద్దేశించి తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతోన్న సంగతి తెలిసిందే. శుక్రవారం నుంచి రెండు వారాల పాటు ఎలాంటి షోలు వేయకూడదని తెలంగాణ థియేటర్ అసోసియేషన్ నిర్ణయించింది. థియేటర్ కి జనాలు రాకపోవడం, ఎన్నికలు సీజ.న్ కావడం , ఐపీఎల్ సీజన్ , అధిక ఉష్ణోగ్రతలు నమోద్వడంతో వంటి కారణాలతో తాత్కాలికంగా మూత వేస్తున్నారు. తాజాగా ఈ పరిస్థితిని ఉద్దేశించి తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
'థియేటర్లో ప్రదర్శనలు రద్దు చేస్తే రోజుకు నాలుగు వేలు నష్టం వస్తుంది. అదే ప్రదర్శనలు కొనసాగిస్తే ఆరు వేలు నష్టం వస్తుంది. సినిమాలు ఆడిస్తేనే ఎక్కువ నష్టం వస్తుందని కొన్నాళ్ల పాటు మూత వేయాలని నిర్ణయించాం. సినిమా రిలీజ్ లేక, మాకు గిట్టు బాటు కాకపోవడంతోనే ఈ నిర్ణయం ఎవరికి వారుగా తీసుకున్నాం. దీనికి అసోసియేషన్ కి ఎలాంటి సంబంధం లేదు. కొత్త సినిమాలొస్తే థియేటర్లు మళ్లీ తెరుస్తాం.
జిల్లా కేంద్రాల్లోనూ..పట్టణాల్లో ఒక్కో థియేటర్ కి 10 నుంచి 12 వేలు, అదే కార్పోరేషన్ లో అయితే 15 నుంచి 18 వేలు ఖర్చు అవుతున్నాయి. వసూళ్లు చూస్తే 5 నుంచి 6 వేలు కూడా ఉండటం లేదు. సరైన సినిమాలు లేక ప్రేక్షకులు థియేట్ కి రావడం లేదు. కొత్త సినిమాలు..మంచి కంటెంట్ ఉన్న కథలుంటే ఆడియన్స్ వచ్చే వారు. అవి లేకపోవడంతోనే ఈ పరిస్థితి దాపరించింది. సింగిల్ స్క్రీన్ లే కాదు. మల్టీప్లెక్స్ ల్లోనూ ప్రదర్శనలు తగ్గిపోయాయి. తెలంగాణ లో దాదాపు సింగిల్ స్క్రీన్లు అన్ని మూసేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా నిర్మాత వచ్చి ఖర్చులు మేం భరిస్తాం...వేయండి అని అడిగితే వేయడానికి సిద్దంగా ఉన్నాం' అని అన్నారు.
దీన్ని బట్టి సినిమాల పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకొచ్చు. అదే ఇలాంటి సమయంలో సరైన కంటెంట్ ఉన్న సినిమాలు ఒకటి రెండు ఉంటే వాటితో ఓ నెల రోజుల పాటు సర్దుబాటు జరిగేది. ఏపీలో కూడా చాలాచాట్లో సింగిల్ స్క్రీన్ లో షోలు వేయడం లేదు. నాలుగు షోలకు గాను ఒకటి రెండు షోలే వేస్తున్నారు. అది కూడా థియేటర్ పావు వంతు నిండటం కూడా కానా కష్టంగా కనిపిస్తుంది. స్మార్ట్ ఫోన్..ఓటీటీ వంటి మాధ్యమాల ప్రభావం జనాల్లో ఎలా ఉందో అర్దమవుతోంది.