సుంద‌ర‌కాండ‌: అంద‌మైన మెలోడి 'బ‌హుశా బ‌హుశా'

మధ్య వయస్కుడైన ఒంటరి వాడిగా నారా రోహిత్ పాత్రను ఇటీవ‌ల రిలీజ్ చేసిన‌ టీజ‌ర్ పరిచయం చేసిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-11 17:57 GMT

నారా రోహిత్ న‌టించిన‌ మైలురాయి (20వ) చిత్రం 'సుందరకాండ'. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) పతాకంపై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి , రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. మధ్య వయస్కుడైన ఒంటరి వాడిగా నారా రోహిత్ పాత్రను ఇటీవ‌ల రిలీజ్ చేసిన‌ టీజ‌ర్ పరిచయం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో వినోదానికి కొద‌వేమీ లేద‌ని ప్రూవ్ అయింది.

పాట‌లు అద్భుతంగా కుదిరాయని తాజాగా రిలీజైన బ‌హుశా బ‌హుశా లిరికల్ వీడియో వెల్ల‌డిస్తోంది. లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మొదటి సింగిల్ బహుశా బహుశా విడుదలతో ప్రచారం ప‌రంగా ఉత్సాహం మొద‌లైంది. ఈ పాట నారా రోహిత్- శ్రీ‌దేవి విజ‌య్ కుమార్ జోడీపై చిత్రీక‌రించారు. ఇది మొదటి ప్రేమ, చిన్ననాటి క్రష్‌ని అందంగా ఆవిష్క‌రిస్తోంది. టీనేజీ వ‌య‌సులో స‌రిగ‌మ‌ల్ని తెర‌పై చూపిస్తుంది. ఫ్లూట్ , మౌత్ ఆర్గాన్ వంటి రేర్ ఇన్ స్ట్రుమెంటేష‌న్ తో కంపోజిషన్ ఆక‌ట్టుకుంది. ప్రఖ్యాత గాయకుడు సిద్ శ్రీరామ్ ఈ పాట‌కు జీవం పోశారు. అతడి శ్రావ్య‌మైన గొంతు ఈ పాట వెయిట్ ని పెంచింది. ప‌డిక‌ట్టు ప‌దాల‌తో సింపుల్ గా రిథ‌మిక్ గా సాగేలా శ్రీ హర్ష ఈమాని సాహిత్యం అందించ‌డం గొప్ప‌త‌నం. శ్రీదేవి అంటే రోహిత్‌కి ఉన్న లోతైన భావాలను ఈ పాట ఆవిష్క‌రించింది. ఓవరాల్‌గా బహుశా బహుశా అనేది మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ స్లాట్ వైపు దూసుకెళుతోంది.

నారా రోహిత్, వృత్తి వాఘని, శ్రీ దేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, కమెడియన్ సత్య, అజయ్, VTV గణేష్, అభినవ్ గోమతం, విశ్వంత్, రూపా లక్ష్మి, సునైనా, రఘు బాబు త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రానికి ప్రదీప్ ఎం వర్మ సినిమాటోగ్రఫీ అందించగా, రాజేష్ పెంటకోట క‌ళ‌ను అందించాఉ. ఈ చిత్రానికి సందీప్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత. ఈ చిత్రానికి రచన & దర్శకత్వం: వెంకటేష్ నిమ్మలపూడి, నిర్మాతలు: సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళ్లి, బ్యానర్: సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP)

Full View
Tags:    

Similar News