వాళ్ళందరికీ రానా నెంబర్ ఇస్తాను: సందీప్ కిషన్

ఇదిలా ఉంటే తాజాగా యువ హీరో సందీప్ కిషన్ ఈ విషయంపై కాస్తా భిన్నంగా స్పందించారు.

Update: 2024-11-13 05:00 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఇటీవల కాలంలో చాలా మంది కొత్త హీరోలు ఎంట్రీ ఇచ్చారు. అయితే కొంతమంది తమ సినిమాని ప్రమోట్ చేసుకొని మార్కెట్ లోకి పంపించడానికి తెగ కష్టపడుతూ ఉంటారు. ఎన్ని చేసిన ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించలేకపోతున్నామని, ఇండస్ట్రీలో పెద్దవాళ్ళ నుంచి సపోర్ట్ ఉండటం లేదని అంటూ ఉంటారు. రీసెంట్ గా ‘జితేందర్ రెడ్డి’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో రాకేష్ వర్రే కూడా ఈ కామెంట్స్ చాలా సీరియస్ గానే చేశారు.

అయితే ఇండస్ట్రీలో ఎవరికి ఎవరు సపోర్ట్ చేయరని, టాలెంట్ ఉండి ప్రూవ్ చేసుకుంటేనే ఎవరో ఒకరు వచ్చి కంగ్రాట్స్ చేస్తారని నిర్మాత దిల్ రాజు అన్నారు. ఇదిలా ఉంటే తాజాగా యువ హీరో సందీప్ కిషన్ ఈ విషయంపై కాస్తా భిన్నంగా స్పందించారు. అశోక్ గల్లా హీరోగా తెరకెక్కిన ‘దేవకీ నందన వాసుదేవ’ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి సందీప్ కిషన్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండస్ట్రీలో చాలా మంది కొత్త వాళ్ళకి రానా పెద్దదిక్కు అని కొనియాడారు.

నాకు కూడా రానానే పెద్ద దిక్కు అని అన్నారు. ఈ మధ్య కొందరు మాకు సపోర్ట్ లేదని బాధపడటం చూసాను. వారందరికి రానా నెంబర్ ఇస్తాను. ఒక్క ఫోన్ చేస్తే అతను వచ్చేస్తాడు. అలాగే మాలాంటి వారిని కూడా తీసుకొని వస్తాడు అని సందీప్ కిషన్ తెలిపారు. ఏదైనా వేదిక మీద మాట్లాడే అవకాశం వస్తే చెప్పాలని చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ సారి ఆ అవకాశం వచ్చింది.

అందుకే చెబుతున్నాను. ప్రతి ఒక్కరిని రానా సపోర్ట్ ఉంటుంది. అతను ప్రోత్సహిస్తాడు అని సందీప్ కిషన్ తెలిపారు. రానా చాలా కాలంగా మంచి కథలతో తెరకెక్కే చిన్న సినిమాలని సురేష్ ప్రొడక్షన్స్ మీదుగా రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఈ మధ్య సొంతగా ఒక బ్యానర్ కూడా స్టార్ట్ చేశాడు. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన నివేదా థామస్ ‘35 చిన్న కథ కాదు’ మూవీకి రానా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.

అలాగే ఆ చిత్రాన్ని దగ్గరుండి ప్రమోట్ చేశాడు. చాలా మంది యంగ్ టాలెంటెడ్ రైటర్స్, డైరెక్టర్స్ కి రానా సపోర్ట్ చేస్తుంటాడని ఇండస్ట్రీలో వినిపించే మాట. అందుకే సందీప్ కిషన్ కూడా రానా గురించి మూవీ ఈవెంట్ లో ప్రశంసలు కురిపించాడు. ఇక రానా హీరోగా సినిమా చేసి చాలా కాలమైంది. నేనే రాజు నేను మంత్రి - ఘాజి లాంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న రానా సోలోగా మళ్ళీ అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలతో రావాలని ఆడియెన్స్ కోరుకుంటున్నారు. మరి రానా తదుపరి సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News