మజాకా చిరూ రేంజ్ కథ కాదట!
సందీప్ కిషన్, రావు రమేష్ కలిసి తండ్రీ కొడుకులుగా నటించిన సినిమా మజాకా. ఈ సినిమా ఫిబ్రవరి 26న శివరాత్రి సందర్భంగా రిలీజ్ కానుంది.
సందీప్ కిషన్, రావు రమేష్ కలిసి తండ్రీ కొడుకులుగా నటించిన సినిమా మజాకా. ఈ సినిమా ఫిబ్రవరి 26న శివరాత్రి సందర్భంగా రిలీజ్ కానుంది. రిలీజ్ లో భాగంగా చిత్ర యూనిట్ సినిమాను తెగ ప్రమోట్ చేసేస్తుంది. అయితే ఈ ప్రమోషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దానికి కారణాలు లేకపోలేదు.
చిరంజీవి భోళా శంకర్ చేస్తున్న టైమ్ లో మజాకా రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ కథతో సోగ్గాడే చిన్ని నాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. చిరంజీవి, సిద్ధు జొన్నలగడ్డ కలిసి ఈ సినిమాలో నటించనున్నారని, సుస్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించనుందని అన్నారు.
తర్వాత సిద్ధు ఈ సినిమాను చేయనని చెప్పడం, అతని ప్లేస్ లో మరో ఇద్దరు ముగ్గురు యంగ్ హీరోల పేర్లు కూడా వినిపించడం వల్ల ఆ ప్రాజెక్టు బాగానే వార్తల్లోకెక్కింది. కానీ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ ప్రాజెక్టు అడ్రెస్సే లేకుండా పోయింది. అవన్నీ అయిపోయాయి, భోళాశంకర్ తర్వాత చిరూ వశిష్టతో విశ్వంభర చేస్తున్నాడు.
కట్ చేస్తే, ఇప్పుడదే కథ కొంచెం మారి మాజాకా గా తెరకెక్కిందని తెలుస్తోంది. ఈ విషయంలోనే మజాకా ప్రమోషన్స్ లో చిరంజీవి హైలైట్ అవుతున్నాడు. అంటే రావు రమేష్ చేసిన పాత్ర చిరూ చేయాల్సిందన్నమాట. కానీ ఈ సినిమాలో తండ్రి పాత్ర చిరూ స్థాయికి సరిపోదని స్వయంగా హీరో సందీప్ కిషనే ప్రమోషన్స్ లో వెల్లడించాడు.
మజాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన సైతం ఇదే విషయాన్ని చెప్తున్నాడు. ఈ కథ చిరంజీవి దగ్గరకు వెళ్లిన మాట నిజమే కానీ, ఆ వెర్షన్ ఎలాంటిదనేది మాత్రం తనకు తెలియదని, ఇందులో తండ్రి పాత్ర రావు రమేష్ ఇమేజ్ కు సరిపోయే పాత్ర అని, మెగాస్టార్ స్థాయికి ఈ కథ సరిపోదని తెలిపాడు. హీరో, డైరెక్టర్ చెప్పడమే కాదు, మజాకా ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరూ ఇదే అభిప్రాయాన్ని వెల్లిబుచ్చాతున్నారు. ట్రైలర్ ఎంటర్టైనింగ్ గా ఉన్నప్పటికీ రావు రమేష్ పాత్రలో చిరంజీవిని ఊహించుకోలేమని, అది ఆయన స్థాయి సినిమా కాదని, ఈ కథను వదులుకుని చిరంజీవి మంచి పనే చేశాడని అభిమానులు భావిస్తున్నారు.