జీతాలు ఇవ్వడం కోసం సినిమాలు చేస్తున్నా..!
తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో సందీప్ కిషన్ తన ఆర్థిక పరిస్థితి గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. విభిన్న చిత్రాలను చేస్తూ నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్న సందీప్ కిషన్ ఈ వారం ఊరు పేరు భైరవకోన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
విడుదలకు ముందు నుంచే ఈ సినిమాకి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. సినిమాలోని ఒక పాట సూపర్ హిట్ అవ్వడంతో పాటు మంచి థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను దర్శకుడు రూపొందించాడని టీజర్ మరియు ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది. కనుక ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో సందీప్ కిషన్ తన ఆర్థిక పరిస్థితి గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొంత కాలంగా తాను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అందుకే తన స్టాఫ్ కి జీతాలు ఇవ్వడం కోసం కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్ ను చేయాల్సి వచ్చిందని కూడా చెప్పుకొచ్చాడు.
ఇటీవల ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమాలో సందీప్ కిషన్ గెస్ట్ రోల్ లో కనిపించాడు. సందీప్ తన స్టాఫ్ కి జీతాలు ఇవ్వడం కోసం అలాంటి సినిమాలు చేస్తున్నాను అని చెప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.
హీరోగానే కాకుండా హోటల్ బిజినెస్ ఇతర బిజినెస్ లు కూడా రన్ చేసిన సందీప్ కిషన్ ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అంటూ చెప్పడం ఆశ్చర్యంగా ఉందని కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఊరు పేరు భైరవకోన సినిమా హిట్ అవ్వడంతో కచ్చితంగా సందీప్ కిషన్ సమస్యలన్నీ తొలగి పోతాయని ఆయన సన్నిహితులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
సందీప్ కిషన్ హీరోగా నటించిన ఊరు పేరు భైరవకోన సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. విఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమాను రాజేష్ దండా నిర్మించారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.