ఈ వారం రాబోయే సినిమాలో సునీల్.. బిగ్ సర్ ప్రైజ్!

ఇక ఈ వారం విడుదల కాబోయే ఒక సినిమాలో సునీల్ సరికొత్తగా సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.;

Update: 2025-03-26 16:06 GMT
Sunil role in Mad square movie

కమెడియన్‌గా టాలీవుడ్‌లో ఒక తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సునీల్, గత కొంతకాలంగా తన కెరీర్‌ను పూర్తిగా కొత్త దారిలో తీసుకెళ్తున్నారు. ‘పుష్ప’ సినిమాలో మంగళం శ్రీను పాత్రతో మ్యాసీ ఇమేజ్‌ను సంపాదించుకున్న అతను, అప్పటి నుంచి రెగ్యులర్ కామెడీ ట్రాక్‌కి దూరంగా ఉండి, పాత్రలో వెరైటీ కోసం కృషి చేస్తున్నారు. ఇక ఈ వారం విడుదల కాబోయే ఒక సినిమాలో సునీల్ సరికొత్తగా సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఆ సినిమా మరేదో కాదు.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రానున్న ‘మ్యాడ్ స్క్వేర్’. ఇందులో సునీల్ క్యారెక్టర్ మాత్రం ఫుల్ టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. ఇంకా ఎక్కడా రివీల్ చేయలేదు కానీ, ఈ సినిమాలో సునీల్ భాయ్ క్యారెక్టర్‌ను పోషిస్తున్నాడని తెలుస్తోంది. అయితే ఇది రెగ్యులర్ భాయ్ క్యారెక్టర్ కాదు. నెల్సన్ దిలీప్‌కుమార్ ‘జైలర్’ సినిమాలో చూపించిన డార్క్ హ్యూమర్ తరహాలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

సీరియస్‌నెస్‌తో పాటు హాస్యాన్ని చక్కగా మిక్స్ చేస్తూ కనిపించనున్నాడట. జైలుర్, పుష్ప వంటి భారీ సినిమాల్లోనూ పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్‌ను ఎంచుకోవడం చూస్తే… అతను కామెడీ ట్రాక్‌కి స్టీరియోటైప్ కాకుండా, వరైటీ క్యారెక్టర్ల కోసం వెదుకుతున్నాడనే విషయం స్పష్టమవుతుంది. మ్యాడ్ స్క్వేర్ లో పాత్ర దాదాపుగా ఒక డిఫరెంట్ స్కెల్ ఉంటుందట. క్లాస్, మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా స్క్రిప్ట్ వ్రాసారట.

ఈ సినిమాలో తమన్ BGM, సునీల్ పాత్రకు ప్రత్యేక ట్రీట్మెంట్ ఇవ్వనుందని సమాచారం. సునీల్ పాత్ర వస్తే థియేటర్లో సౌండ్ క్లాప్స్ పడతాయని యూనిట్ భావిస్తోంది. పాత్రను డిజైన్ చేసిన డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ విజన్ కూడా క్యూరియాసిటీ పెంచుతోంది. చిన్న చిన్న భయానక, క్రేజీ యాంగిల్స్ ఉండేలా ప్లాన్ చేయడం చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇది సునీల్ కోసం ఓ టర్నింగ్ ఫిల్మ్‌గా నిలవవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆడియెన్స్‌లోనూ, సోషల్ మీడియాలోనూ అతని లుక్, క్యారెక్టర్‌ను రివీల్ చేయమంటూ డిమాండ్స్ పెరుగుతున్నాయి. మ్యాడ్ స్క్వేర్‌లో సునీల్ పాత్ర ప్రేక్షకుల్లో ఎంతగానో కిక్ ఇస్తుందనడంలో సందేహం లేదు. సినిమా విజయం సాధిస్తే, భవిష్యత్తులో ఇలాంటి పాత్రల కోసమే ఆయన్ను డైరెక్టర్లు వెతుకుతారేమో. మొత్తానికి.. కామెడీ నుంచి డార్క్ ఎంటర్టైన్మెంట్ వరకు ప్రయాణిస్తున్న సునీల్, మ్యాడ్ స్క్వేర్ ద్వారా మరోసారి తన స్టైల్‌ను మార్చబోతున్నారు. ఏప్రిల్ 28న సినిమా విడుదల కాబోతుండగా, భాయ్ క్యారెక్టర్ ఎలాంటి హడావుడి చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News