సెట్స్‌లో స్టార్ హీరోకి తీవ్ర గాయం!
బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి తన వెబ్ సిరీస్ 'హంటర్' కోసం యాక్షన్ ప్యాక్డ్ ఫైట్ సన్నివేశంలో పాల్గొంటున్నారు. అయితే సీన్ లో ఒక దుంగ అదుపు తప్పి శెట్టిని ఢీకొట్టడంతో ప్రమాదవశాత్తూ గాయపడ్డారు.
ఆన్ లొకేషన్ రిస్కీ స్టంట్స్ చేసేప్పుడు ఒక్కోసారి స్టార్లు ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఒక ప్రమాదంలో స్టార్ హీరో తీవ్రంగా గాయపడ్డారు. అతడిని ఆస్పత్రిలో చేర్చారని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి తన వెబ్ సిరీస్ 'హంటర్' కోసం యాక్షన్ ప్యాక్డ్ ఫైట్ సన్నివేశంలో పాల్గొంటున్నారు. అయితే సీన్ లో ఒక దుంగ అదుపు తప్పి శెట్టిని ఢీకొట్టడంతో ప్రమాదవశాత్తూ గాయపడ్డారు. సునీల్ శెట్టి పక్కటెముకకు బాధాకరమైన గాయం తగిలింది. సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో ఒక చెక్క లాగ్ వచ్చి తగిలిందని తెలుస్తోంది. అతడికి తక్షణమే వైద్య సహాయం అవసరం. అతడి పక్కటెముకల్లో పగుళ్లు లేదా అంతర్గత గాయాల గురించి తెలుసుకునేందుకు ఎక్స్-రే తీసి పరీక్షించారని సమాచారం.
ప్రస్తుతం ముంబైలో హంటర్ చిత్రీకరణ సాగుతోంది. అయితే డూప్ ల అవసరం లేకుండా యాక్షన్ విన్యాసాలు చేసేందుకు ఆసక్తిని కనబరిచే సునీల్ శెట్టి అంకితభావంతో సీన్ చిత్రణలో పాల్గొన్నారు. కానీ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రమాద సమయంలో నలుగురైదుగురు యాక్షన్ అసిస్టెంట్లు ఉన్నారు. తీవ్రమైన పోరాట సన్నివేశం చిత్రీకరణలో పాల్గొంటున్నారు. సన్నివేశానికి ఒక చెక్క దుంగను ఆసరాగా ఉపయోగించాల్సిన అవసరం ఉంది. కానీ సమయానుకూలంగా అనుకున్నది అనుకున్నట్టు జరగకపోవడంతో దుంగ ప్రమాదవశాత్తు సునీల్ శెట్టికి పక్కటెముకలో తగిలింది. ఈ దెబ్బ తీవ్రమైన నొప్పిని కలిగిస్తోంది. నిజానికి సీనియర్ నటుడికి యాక్షన్ సన్నివేశాలతో అనుభవం ఉన్నప్పటికీ ప్రమాదం ఎదుర్కోవడం తప్పలేదు. అతడి యోగ క్షేమాల గురించి ఆందోళన చెందుతున్న అభిమానులు ప్రస్తుతం అతడి గురించి ఆరాలు తీస్తున్నారు.
సునీల్ శెట్టి తదుపరి వెల్కమ్ టు ది జంగిల్లో కనిపించనున్నాడు. తన పాత స్నేహితులు అక్షయ్ కుమార్, పరేష్ రావల్లతో కలిసి సునీల్ నటిస్తున్నాడు. శెట్టి సౌత్ లో విలన్ పాత్రలను పోషిస్తున్న సంగతి తెలిసిందే.