అందులో సునీల్ రికమండీషన్ హీరోనా!
సునీల్ సెకెండ్ ఇన్నింగ్స్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. కమెడియన్ గా, హీరోగా నటించిన సునీల్ ఇప్పుడు విలన్ పాత్రలు పోషిస్తూ సక్సెస్ అవుతున్నాడు.;

సునీల్ సెకెండ్ ఇన్నింగ్స్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. కమెడియన్ గా, హీరోగా నటించిన సునీల్ ఇప్పుడు విలన్ పాత్రలు పోషిస్తూ సక్సెస్ అవుతున్నాడు. వైవిథ్యమైన ఆహార్యంతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన తమిళ చిత్రం `గుడ్ బ్యాడ్ అగ్లీ`లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అజిత్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన సినిమాలో సునీల్ పాత్రకు మంచి వెయిట్ ఉంది.
సాధారణంగా తమిళ సినిమాల్లో తెలుగు నటులకు అవకాశాలు రావడం కష్టమైన పనే. కోలీవుడ్ నటులకు ఇచ్చిన ప్రాధన్యత అక్కడ దర్శక హీరోలు తెలుగు నటులకు ఇవ్వరు. అందులోనూ తెలుగు వాళ్లతో టచ్ లో లేని తమిళ దర్శకులు అసలే ఛాన్స్ ఇవ్వరు. అయితే ఆధిక్ రవిచంద్రన్ సునీల్ ని ఎంపిక చేయడం అన్నది సర్ ప్రైజ్ అనే చెప్పాలి. మరి ఈ ఛాన్స్ ఎలా సాధ్యమైంది? అంటే అందుకు అసలు కారకుడు హీరో అజిత్ అని తేలింది.
ఈ విషయాన్ని స్వయంగా ఆధిక్ రవిచంద్రన్ తెలిపాడు. సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు. దీనిలో భాగంగా ఆధిక్ ఈ విషయాన్ని చెప్పాడు. సునీల్ పాత్ర సినిమా కు కీలకంగా మారడం విశేషమన్నారు. ఈ సినిమాకు తెలుగు నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మెట్రో పాలిటన్ ఆడియన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు.
సినిమా ప్రారంభమైన పావుగంట బోర్ కొట్టినా? అజిత్ గ్యాంగ్ స్టర్ అంశం రివీల్ అయిన దగ్గర నుంచి చివరి వరకూ స్క్రీన్ ప్లే పరుగులు పెట్టిస్తుంది. ఎక్కడా ల్యాగ్ లేకుండా ఇంట్రెస్టింగ్ గా కథను, కథనాన్ని నడిపించారు. ఈ సినిమా విజయంతో ఆధిక్ రవిచంద్రన్ కు మంచి అవకాశాలు అందుకుంటాడు. ఇప్ప టికే ఆధిక్ పై టాలీవుడ్ హీరోల కన్ను పడిందనే వార్త ప్రచారంలోకి వస్తోంది.