30 ఫ్లాప్‌లు.. 22 ఏళ్లలో జీరో సోలో హిట్‌..66 ఏజ్‌లోను బిజీ హీరో!

22 ఏళ్లలో అతను సోలో హిట్ ఇవ్వడంలో విఫలమయ్యాడు. 30 ఫ్లాపులున్నాయి. అత‌డిని ప్రేక్షకులు దాదాపుగా మర్చిపోయారు అనుకుంటుండ‌గానే, ఒకే ఒక్క సినిమా అతడి ఫేట్‌ని మార్చింది.

Update: 2025-02-26 05:58 GMT

కొన్నిటికి ఆది అంతం తెలీదు. ఎక్క‌డో మొద‌ల‌వుతుంది.. ఎక్క‌డో ఎండ్ అవుతుంది. ఈ న‌టుడి కెరీర్ జ‌ర్నీ కూడా అలానే సాగుతోంది. కెరీర్ లో కొన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు.. యాక్షన్ ఇమేజ్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన ఘ‌నుడు. కెరీర్ లో పీక్ హిట్స్ అందుకున్నాడు. కానీ అతడు ఎన్నో ఫ్లాప్‌లను కూడా ఇచ్చాడు. 22 ఏళ్లలో అతను సోలో హిట్ ఇవ్వడంలో విఫలమయ్యాడు. 30 ఫ్లాపులున్నాయి. అత‌డిని ప్రేక్షకులు దాదాపుగా మర్చిపోయారు అనుకుంటుండ‌గానే, ఒకే ఒక్క సినిమా అతడి ఫేట్‌ని మార్చింది.


బాలీవుడ్ లెజెండరీ ధర్మేంద్ర పెద్ద కుమారుడు సన్నీ డియోల్ 1983లో బేతాబ్‌తో హీరోగా అరంగేట్రం చేశాడు. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. సన్నీ ఆరంగేట్ర‌మే అద్భుతమైన ప్రభావం చూపాడు. అయితే బేతాబ్ తర్వాత సన్నీ కొన్ని మర్చిపోలేని యాక్ష‌న్ బ్లాక్‌బస్టర్‌లలో కనిపించాడు. అర్జున్, త్రిదేవ్, చాల్‌బాజ్ వంటి యాక్షన్, సినిమాలు అతడి ఇమేజ్‌ను ఒక స్టార్ హీరోగా పీక్స్ కి చేర్చాయి. 1990లో `ఘాయల్` మ‌రో లెవ‌ల్ హిట్. అతడి స్టార్ డమ్ ని పెద్ద‌ స్థాయికి తీసుకెళ్లింది. రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహించిన ఘాయల్ తర్వాత బాలీవుడ్ లో వన్ మ్యాన్ ఆర్మీ అయ్యాడు. 90లలో అతడు నర్సింహ, ఘటక్, బోర్డర్, జిద్ది, జీత్ వంటి అనేక బ్లాక్ బస్టర్ లను అందించాడు.

2000లో సన్నీ డియోల్ చివరి సోలో హిట్ `గదర్: ఏక్ ప్రేమ్ కథ`. ఈ చిత్రం ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. చాలా సినిమాల‌ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. గదర్ తర్వాత సన్నీ 22 సంవత్సరాలలో 30 ఫ్లాప్ లను అందించాడు. మధ్యలో అప్నే, యమ్లా పగ్లా దీవానా వంటి హిట్లలో కనిపించాడు. కానీ దానిని డియోల్స్ (ధర్మేంద్ర, సన్నీ, బాబీ) నడిపించారు. అతడి ఫ్లాప్‌లలో కొన్ని బ్లాంక్, చుప్, భయ్యాజీ సూపర్‌హిట్, యమ్లా పగ్లా దీవానా ఫిర్ సే ఇలా పెద్ద లిస్టే ఉన్నాయి.

అయితే చాలా కాలం సినిమాల‌కు దూర‌మై చివ‌రిగా సన్నీ డియోల్ 66 ఏళ్ల వయసులో తిరిగి పుంజుకున్నాడు. 2023లో సన్నీ డియోల్ `గదర్: ఏక్ ప్రేమ్ కథ` సీక్వెల్ అయిన `గదర్ 2`తో బాలీవుడ్‌లో ఘనమైన పునరాగమనం చేశాడు. పార్ట్ 1 లాగానే ఈ సీక్వెల్ ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 686 కోట్లు వసూలు చేసింది. గదర్ 2 ప్రస్తుతం సన్నీ డియోల్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం.

ఈ సినిమా త‌ర్వాతా స‌న్నీడియోల్ భారీ సినిమాల్లో న‌టిస్తున్నాడు. వ‌య‌సు 67 నుంచి 70 వైపు వెళుతున్నా అదే దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నాడు. సన్నీ తదుపరి `లాహోర్ 1947`లో కనిపించనున్నారు. ప్ర‌ఖ్యాత ప్రాప‌ర్టీ వెబ్ పోర్ట‌ల్ క‌థ‌నం ప్ర‌కారం... సన్నీడియోల్ నికర ఆస్తుల‌ విలువ రూ. 120 కోట్లు..

Tags:    

Similar News