రెండు చోట్లా రిలీజ్.. వారం గ్యాప్ ఎందుకో!
సన్నీ డియోల్ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని బాలీవుడ్ లో తెరకెక్కిస్తోన్న `జాట్` చిత్రంపై అక్కడ మంచి అంచనాలున్న సంగతి తెలిసిందే.;

సన్నీ డియోల్ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని బాలీవుడ్ లో తెరకెక్కిస్తోన్న `జాట్` చిత్రంపై అక్కడ మంచి అంచనాలున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ కి శైలి మాస్ యాక్షన్ కంటెంట్ నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాపై పాజిటివ్ ఇంప్రెషన్ పడింది. యాక్షన్ స్టార్ గా సన్ని డియోల్ ఇమేజ్ కూడా వర్కౌట్ అవుతుందనే అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అన్ని పనులు పూర్తి చేసి ఏప్రిల్ 10న హిందీలో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా నిర్మిస్తుంది టాలీవుడ్ నిర్మాణ సంస్థ కావడంతో ఇక్కడ రిలీజ్ చేయరా? అన్న సందేహం ఉంది. ఇక్కడ కూడా రిలీజ్ అవుతుందిట. కానీ వారం గ్యాప్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారుట. తెలుగు వెర్షన్ ఏప్రిల్ 17న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారుట.
దీనికి సంబంధించి త్వరలోనే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. మరి రెండు చోట్లా ఏకా కాలంలో రిలీజ్ చేయలేకపోవడానికి కారణాలు ఏంటి? అన్నది తెలియాల్సి ఉంది. ఇలా రిలీజ్ చేస్తే సినిమా పైరసీ ప్రింట్ బయటకు వచ్చేస్తుంది. అటుపై తెలుగులో రిలీజ్ అయిన అంత ఇంపాక్టివ్ గాను ఉండదు.
మరి హింది రిజల్ట్ ని బట్టి తెలుగులో రిలీజ్ చేయాలి? అన్నది మరో వ్యూహం కావొచ్చు. ఇందులో రణదీప్ హుడా విలన్ గా నటిస్తున్నాడు. సన్నిడియోల్-రణదీప్ హుడా మధ్య యాక్షన్ సన్నివేశాలు పీక్స్ లో ఉంటాయని ఇప్పటికే ప్రచారంలో ఉంది. అలాగే థమన్ ఆర్ ఆర్ తో మరోసారి థియేటర్లు దద్దరిల్లి పోతాయని సౌండింగ్ గట్టిగానే వినిపిస్తుంది.