హీరోయిన్ SRH గోల.. మరో ఆన్సర్ ఇచ్చేసింది!
దీంతో కొందరు నెటిజన్లు ఆమెపై ఫుల్ సీరియస్ అయ్యారు! ముఖ్యంగా సన్ రైజర్స్ అభిమానులు.. హైదరాబాద్ లోనే ఉంటూ ఇక్కడి టీంను సపోర్ట్ చేయరా అని ట్రోల్ చేశారు.
తెలుగమ్మాయి చాందిని చౌదరి టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా గడుపుతోంది. ఇటీవల మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గామి సినిమాతో మంచి హిట్ అందుకుంది. త్వరలోనే మ్యూజిక్ షాప్ మూర్తి, యేవం చిత్రాలతో సందడి చేయనుంది. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ నటిగా మంచి ప్రశంసలు అందుకుంటోంది. దాదాపు పదేళ్లుగా టాలీవుడ్ లో కొనసాగుతోంది.
అయితే కంటెంట్ బలంగా ఉంటే ఎలాంటి కష్టమైన పాత్రలు చేయడానికైనా ముందుంటుంది చాందిని. అలా తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. త్వరలోనే ఆమె నటిస్తున్న మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన టీజర్ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు ఆమె ఫుల్ ట్రోలింగ్ ఎదుర్కొంది. ఆ తర్వాత క్లారిటీ కూడా ఇచ్చింది. అసలేం జరిగిందంటే?
సాధారణంగా ఎవరికి నచ్చినట్టు వాళ్లు ఐపీఎల్ టీంకు సపోర్ట్ చేస్తారు. అయితే మ్యూజిక్ షాపు మూర్తి ప్రమోషన్ లో భాగంగా.. ఏ ఐపీఎల్ టీంను సపోర్ట్ చేస్తారని చాందినిని ఓ రిపోర్టర్ అడిగారు. అప్పుడు తాను ఎక్కువగా క్రికెట్ చూడనని చెప్పింది. ఆ తర్వాత.. తనది ఆంధ్ర అని.. తమ రాష్ట్రానికి టీం లేదు కదా.. ఉంటే దానికే సపోర్ట్ చేసేదాన్ని అంటూ కాస్త వ్యంగ్యంగా సమాధానం ఇచ్చింది.
దీంతో కొందరు నెటిజన్లు ఆమెపై ఫుల్ సీరియస్ అయ్యారు! ముఖ్యంగా సన్ రైజర్స్ అభిమానులు.. హైదరాబాద్ లోనే ఉంటూ ఇక్కడి టీంను సపోర్ట్ చేయరా అని ట్రోల్ చేశారు. కొందరు కావాలనే విపరీతంగా నెగటివ్ ట్రోలింగ్ కూడా చేశారు. దీంతో తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చింది చాందిని. ఏపీకి కూడా ఒక టీం ఉంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే అలా కామెంట్స్ చేశానని చాందిని చెప్పింది.
తాను తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిని కాబట్టి రెండు రాష్ట్రాలంటే తనకు చాలా గర్వమని చెప్పింది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు ఆల్ ది బెస్ట్ అంటూ.. తనపై జరుగుతున్న ట్రోలింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. ఇక చాందిని అభిమానులు, కొంతమంది నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తూ.. ట్రోల్స్ పట్టించుకోకండని సూచిస్తున్నారు. కానీ కొంతమంది హైదరాబాద్ ఫ్యాన్స్ మాత్రం మరోసారి విమర్శలు చేస్తున్నారు. మరి చాందినిపై ట్రోల్స్ ఎప్పుడు ఆగుతాయో చూడాలి.