'సూపర్‌మ్యాన్ రీబూట్' సమ్మర్‌లో ముసళ్ల పండగే
ఈ అడ్వెంచర్ మూవీకి సంబంధించిన క్లిప్ ని ఇంతకుముందు దర్శకుడు జేమ్స్ గన్ విడుదల చేయగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది.;

సూపర్ మ్యాన్ ఫ్రాంఛైజీలో చాలా సినిమాలు మిలియన్ల డాలర్లు కొల్లగొట్టాయి. భారతదేశం నుంచి సునాయాసంగా 100 కోట్లు కొల్లగొట్టడం సంచలనంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా అసాధారణ వసూళ్లను సాధించడంలో ఈ ఫ్యామిలీ సినిమాల తర్వాతే ఇంకేవైనా. పిల్లలు పెద్దలు, మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాలను అలరించే సూపర్ మ్యాన్ సినిమాలకు ముగింపు లేదని 'సూపర్‌మ్యాన్- రీబూట్' ప్రకటనతో క్లారిటీ వచ్చింది.
ఈ అడ్వెంచర్ మూవీకి సంబంధించిన క్లిప్ ని ఇంతకుముందు దర్శకుడు జేమ్స్ గన్ విడుదల చేయగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. ఇప్పుడు అమెరికా లాస్ వేగాస్- కామిక్ కాన్ లో సూపర్ మ్యాన్ రీబూట్ ఫుటేజ్ ని రిలీజ్ చేయగా ఇది సంచలనంగా మారింది. డిసి స్టూడియోస్ అధినేత జేమ్స్ గన్ సూపర్‌మ్యాన్ రీబూట్ స్నీక్ పీక్ క్లిప్‌ను విడుదల చేశారు. ఇది ప్రేక్షకులను సూపర్‌హీరో ప్రపంచంలోకి తీసుకెళుతుంది. దాదాపు ఐదు నిమిషాల ఎక్స్ టెండెడ్ ఫుటేజ్‌లో నటుడు డేవిడ్ కోరెన్స్‌వెట్ గాయపడి కనిపించారు. విజువల్స్ లో డేవిడ్ పెంపుడు కుక్క క్రిప్టో ది రోబో యాక్షన్ లోకి దిగుతుంది. ఆటోమేటన్ విధానంలో అతడికి పెట్ డాగ్ చికిత్స చేయడం అభిమానుల్లో ఉత్సాహం పెంచుతుంది.
జేమ్స్ గన్ సినిమాకాన్‌లో విడుదల చేసిన ప్రత్యేక ఫుటేజ్ చూశాక ప్రేక్షకులలో మరింత ఎగ్జయిట్ మెంట్ పెరిగింది. దాదాపు ఐదు నిమిషాల ఫుటేజ్‌లో నటుడు డేవిడ్ కోరెన్స్‌వెట్ మంచుతో కప్పి ఉన్న ప్రకృతిలో గాయపడి కనిపించాడు. అతడు తన పెంపుడు కుక్క క్రిప్టోను పిలుస్తాడు. పెట్ డాగ్ ను ఇంటికి తీసుకెళ్లమని అడుగుతాడు. ఆపై పెంపుడు కుక్క క్రిప్టో అతడిని స్వగృహం 'ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్'కు లాక్కెలుతుంది. అక్కడ ఆటోమేటన్ల బృందం అతనికి 14 ఫ్రాక్చర్లు దెబ్బతిన్న అవయవాలకు చికిత్స చేస్తుంది. ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ అనేది డిసి కామిక్స్‌లో సూపర్‌మ్యాన్ కి చెందిన పాపులర్ మంచు గుహ. ఈ క్లిప్‌లో హీరో సౌరశక్తితో చికిత్స పొందడం ఆసక్తిని కలిగిస్తుంది. చికిత్స సమయంలో అతడు నొప్పితో అరుస్తాడు. ఒకే ఒక్క టీజర్ తో కిక్కు తెచ్చారు. మునుముందు ట్రైలర్ తో ఇంకా రక్తి కట్టించబోతున్నారు. జూలై 11న థియేటర్లలోకి ఈ సినిమా విడుదల కానుంది.