మరో ఘాటైన లుక్కుతో సుప్రిత సెల్ఫీ మ్యాజిక్
సుప్రిత మొదటగా మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్ అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా యాక్టింగ్‌లో అడుగుపెట్టింది.
సుప్రిత నాయుడు టాలీవుడ్లో నటిగా ఎంట్రీ ఇవ్వకముందే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అందాలవాణి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురిగా సోషల్ మీడియాలో బాగా క్రేజ్ అందుకున్న ఆమె పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకుంది. ఎక్కువగా గ్లామరస్ ఫోటోషూట్లతో యూత్ మనసులు దోచేసింది. సుప్రిత మొదటగా మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్ అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా యాక్టింగ్‌లో అడుగుపెట్టింది.
అక్కడి నుంచి ఆవర్స్ వర్సెస్ అదుర్స్, వెళ్లిపో, గాయత్రి పోతే పోవే వంటి అనేక కవర్ సాంగ్స్‌లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ని సృష్టించుకుంది. తాజాగా సుప్రిత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోషూట్‌లో తన గ్లామర్ షోతో అందరినీ మైమరిపించింది. బ్రౌన్ కలర్ డ్రస్‌లో సింప్లిసిటీని ప్రదర్శిస్తూ తన అటిట్యూడ్‌తో మెస్మరైజ్ చేసింది. "అందం అనేది రూపం కాదు.. అది ఒక అటిట్యూడ్" అంటూ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చి, తన ధైర్యాన్ని వెల్లడించింది.
ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, మరియు అభిమానులు పాజిటివ్ కామెంట్స్‌తో ఫోటోను ప్రశంసిస్తున్నారు. సుప్రిత ప్రస్తుతం టాలీవుడ్లో తన తొలి సినిమా కోసం శ్రమిస్తోంది. బిగ్ బాస్ 7 రన్నరప్ అమర్ దీప్తో ఇప్పటికే ఒక సినిమా చేసింది. ఇక త్వరలో ఒక యువ నటుడితో నటించినున్నట్లు తెలుస్తోంది. ఒక సినిమా ఆమె కెరీర్లో మొదటి మైలురాయి నిలవనుందట. షూటింగ్ పిక్స్‌ను సోషల్ మీడియాలో పంచుకుంటూ, పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ వివరాలను షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది.
సుప్రిత సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ, కొత్త ఫోటోషూట్లతో తన ఫాలోవర్లను ఆకర్షిస్తోంది. ఫోటోలోని లుక్, ఆమె చూపులు నెటిజన్లను ఓ రేంజ్లో ఆకర్షించాయి. సరికొత్త ఔట్ఫిట్స్, స్టైల్ మరియు ధైర్యం చూపిస్తూ, సుప్రిత మరింత ఫ్యాన్ బేస్‌ను సంపాదిస్తోంది. మరి ఆమె ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.