సుప్రీత గ్లామర్ డోస్.. ఆ డ్రెస్సుకే అందం వచ్చేలా..

సుప్రీత మరోసారి మైండ్ బ్లోయింగ్ ఫోటోలను షేర్ చేసింది. లాంగ్ ఫ్రాక్ లో అమ్మడు ఇచ్చిన స్టిల్స్ చాలా స్టైలిష్ గా ఉన్నాయి. లుక్స్ తోనే మాయ చేస్తూ తన అందాన్ని మరింత పెంచుకుంది.

Update: 2024-08-17 07:13 GMT

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సురేఖా వాణి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లి పాత్రలు, అత్త క్యారెక్టర్లు, సహాయ నటిగా ఆమె ఎంతో మంది మనసుల్లో నిలిచిపోయారు. ముఖ్యంగా బ్రహ్మానందం వంటి స్టార్ కమెడియన్స్ పక్కన నటిస్తూ ఆమె ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు.

 

కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో కూడా సురేఖా వాణి తన గ్లామర్ తో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆమె కూతురు సుప్రీత కూడా ప్రస్తుతం మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. సుప్రీత తన తల్లి సురేఖా వాణితో కలిసి అప్పుడప్పుడు కొన్ని ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. వీళ్లిద్దరూ ఎప్పుడూ పక్క పక్కన కనిపిస్తుంటే, అక్కాచెల్లెళ్ల లా కనిపిస్తారు, తల్లీకూతుళ్లలా అస్సలు కనిపించరు అనేలా నెటిజన్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంటారు.

 

సుప్రీతకు ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ప్రతి రోజు ఆమె షేర్ చేసే కొత్త ఫోటోలు యువతరాన్ని ఆకట్టుకుంటున్నాయి. ఇక సుప్రీత సినీ రంగంలోకి అడుగు పెట్టాలని ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తుండగా, ప్రస్తుతం ఆమె డెబ్యూ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వక ముందే సుప్రీత హీరోయిన్లకు మించిన క్రేజ్‌ను సంపాదించుకుంది.

 

ఇక ఆమె రీసెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి. సుప్రీత మరోసారి మైండ్ బ్లోయింగ్ ఫోటోలను షేర్ చేసింది. లాంగ్ ఫ్రాక్ లో అమ్మడు ఇచ్చిన స్టిల్స్ చాలా స్టైలిష్ గా ఉన్నాయి. లుక్స్ తోనే మాయ చేస్తూ తన అందాన్ని మరింత పెంచుకుంది. సుప్రీత ఫోటోలు చూసిన నెటిజన్లు ఆమెను పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అని కొనియాడుతున్నారు.

అలాగే ఆమె అందంతో డ్రెస్సుకే అందం వచ్చిందని మరికొందరు అంటున్నారు. ఇక తల్లి సురేఖా వాణి సినీ ఇండస్ట్రీలో ఒక స్ట్రాంగ్ కెరీర్ సెట్ చేసుకున్నట్లే, కూతురు సుప్రీత కూడా తన తొలి సినిమాతో ఎలాంటి మంచి క్రేజ్ అందుకోవాలి అని ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. మరి మొదటి సినిమా ఆమె కెరీర్‌ను ఎలా మార్చుతుందో, ఆమె క్రేజ్‌ను ఇంకెంతగా పెంచుతుందో చూడాలి.

Tags:    

Similar News