ఏజెంట్ డైరెక్టర్ ఏం చేస్తున్నాడు!

ఈ మూవీ ఎఫెక్ట్ సురేందర్ రెడ్డి కెరియర్ మీద పడిందనే మాట ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది.

Update: 2024-07-07 12:30 GMT

ఒక్క సినిమా స్టార్ డైరెక్టర్స్ ని సైతం క్రింద పడేస్తుంది. అదే ఒక్క సినిమా కొత్త డైరెక్టర్స్ ని సైతం స్టార్స్ గా మార్చేస్తుంది. ఇండస్ట్రీలో దర్శకుల కెరియర్ లో ఈ రెండు దశలు కచ్చితంగా ఉంటాయి. విరూపాక్ష సినిమాతో కార్తిక్ దండు స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. అలాగే బుచ్చిబాబు సానా కూడా పాన్ ఇండియా మూవీ చేసే స్థాయికి చేరిపోయాడు. సందీప్ రెడ్డి వంగా అయితే అర్జున్ రెడ్డి సినిమా సక్సెస్ తో దేశం మొత్తం తన వైపు తిరిగి చూసేలా చేసుకున్నాడు.

అలాగే మంచి కమర్షియల్ సక్సెస్ లు అందుకొని స్టార్ డైరెక్టర్స్ గా పేరు తెచ్చుకున్నవారిలో శ్రీనువైట్ల, సురేందర్ రెడ్డి ఉన్నారు. సురేందర్ రెడ్డి మెగాస్టార్ తో సైరా నరసింహారెడ్డి సినిమా చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. టేకింగ్ పరంగా బెస్ట్ అనిపించుకున్నాడు. అయితే తరువాత అఖిల్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఏజెంట్ సినిమాని సురేందర్ రెడ్డి చేశాడు.

ఈ సినిమా అఖిల్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా మారింది. నిర్మాతకి కూడా దారుణ నష్టాలు తీసుకొచ్చింది. ఇక సురేందర్ రెడ్డి ఇమేజ్ ని పూర్తిగా డ్యామేజ్ చేసింది. ఈ మూవీ ఎఫెక్ట్ సురేందర్ రెడ్డి కెరియర్ మీద పడిందనే మాట ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. ఏజెంట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి సినిమా చేయాల్సి ఉంది. ప్రొడ్యూసర్ కూడా కన్ఫర్మ్ అయ్యారు.

అయితే ఏజెంట్ మూవీ డిజాస్టర్ అవ్వడంతో పాటు పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ కావడంతో ఈ మూవీ సెట్ కాలేదు. పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న కథ కూడా పెద్దగా మెప్పించలేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో కొంత గ్యాప్ తీసుకొని విక్టరీ వెంకటేష్ కోసం కథ సిద్ధం చేసే పనిలో సురేందర్ రెడ్డి ఉన్నారంట. అయితే దీనిపై ఎలాంటి సౌండ్ లేదు. అలాగే గతంలో వేరొక యంగ్ హీరోతో మూవీ చేస్తాడనే టాక్ వచ్చింది. అది కూడా కార్యరూపం దాల్చలేదు.

ఏజెంట్ సినిమా ఇంపాక్ట్ సురేందర్ రెడ్డి ఇమేజ్ ని ఏ విధంగా డ్యామేజ్ చేసిందో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఇలాగే ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ గా చలామణి అయిన వారు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నారు. వారు సినిమాలు చేస్తున్నట్లు కూడా ఎవరికి తెలియదు. శ్రీనువైట్ల గోపీచంద్ తో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉందని టాక్ వినిపిస్తోంది. మరి సురేందర్ రెడ్డి వెంకీతో సినిమా చేస్తాడా లేదంటే ఎవరైనా యంగ్ హీరోను లైన్ లో పెడతాడా అనేది చూడాలి.

Tags:    

Similar News