నువ్వు చెబితే మేము వినాలా? మాకు తెలీదా? అన్నారు!
మూవీ మోఘల్ రామానాయుడు వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని సురేష్ బాబు నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
మూవీ మోఘల్ రామానాయుడు వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని సురేష్ బాబు నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నిర్మాతగా ఎన్నో సినిమాలు నిర్మించారు. డిస్ట్రిబ్యూటర్ గా , నిర్మాతగా, అపార అనుభవం ఆయన సొంతం. నిర్మాతగా ఆయనకంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు. ప్రొడక్షన్ రంగంలో ఎంతో గొప్ప అనుభవం సంపాదించారు. సాకేతికతను అందిపుచ్చుకోవడంలో ఆయనెంతో ముందుంటారు.
ప్యూచర్ సినిమా ఎలా ఉండబోతుందన్నది ఆయన పదేళ్ల క్రితమే గెస్ చేసి చెప్పారు. అలాగే నిర్మాతలకు ఉండాల్సిన లక్షణాల గురించి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఆ మధ్య నిర్మాతలకు స్క్రిప్ట్ ల పట్ల సరైన అవగాహన ఉండటం లేదని అందుకే సినిమాలు నష్టాలబాట పడుతున్నాయన్న వాదన బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. కథల పట్ల నిర్మాతలు కొంత అనుభవం, నాలెడ్స్ సంపాదించుకోవాలని దిల్ రాజు లాంటి వారు సూచించారు.
ఇక సురేష్ బాబు నిర్మాతల సంఘం అధ్యక్షుడిగానూ పనిచేసారు. అయితే తాను అధ్యక్షుడు అయిన సమయంలో కొత్త నిర్మాతలకు కార్డులు ఇచ్చే సమయంలో? ప్రొడక్షన్ రంగంలో తనకున్న అనుభవాన్ని చెప్పాలనుకున్నప్పుడు కొందరు నిర్మాతలు సురేష్ బాబు నువ్వెవరు? మాకు చెప్పడానికి అన్నట్లు వ్యవరించినట్లు ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. మీ నాన్న అనుభవంతోనే నిర్మాత అయ్యారా? మీరు అనుభవంతోనా అయ్యారా? మా సినిమా మా. డబ్బు మా ఇష్టం అన్న ధోరణి సురేష్ బాబు వద్ద చూపించే ప్రయత్నం చేసారుట.
దీంతో ఆ తర్వాత కాలంలో సురేష్ బాబు కూడా పట్టించుకోవడం మానేసినట్లు తెలిపారు. బాలీవుడ్ లో నిర్మాతలు మాత్రం ప్రొడక్షన్ లో మంచి అనుభవం సంపాదించిన తర్వాతే పెట్టుబడి పెడతారన్నారు. ముఖ్యంగా ఇప్పుడొ స్తున్న యువ నిర్మాతలంతా ఫిల్మ్ స్కూల్లో ప్రొడక్షన్ గురించి నాలెడ్జ్ సంపాదించుకుని వస్తున్నారన్నారు. అందువల్ల ఏ కథకి ఎంత పెట్టాలి? దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి? అన్నది పక్కాగా వాళ్లకు తెలుస్తుందన్నారు. అన్నపూర్ణ, రామానాయుడు స్కూల్ నుంచి కూడా ఇలాంటి విద్యార్దులు కొందరున్నారు. అలాగే మునుపటి కంటే ఇప్పుడు టాలీవుడ్ లో నిర్మాతల వాతావరణం కూడా మారిందన్నారు.