టాలీవుడ్ లో నెంబ‌ర్- 1 ఎవ‌రో? చెప్ప‌డం అసాధ్యం!

టాలీవుడ్ లో నెంబ‌ర్ వ‌న్ హీరో ఎవ‌రు? అంటే ఎవ‌రూ స‌మాధానం చెప్ప‌లేరు. ఎందుకంటే ఇక్క‌డ పోటీ అలా ఉంటుంది.

Update: 2024-10-04 05:41 GMT

టాలీవుడ్ లో నెంబ‌ర్ వ‌న్ హీరో ఎవ‌రు? అంటే ఎవ‌రూ స‌మాధానం చెప్ప‌లేరు. ఎందుకంటే ఇక్క‌డ పోటీ అలా ఉంటుంది. ఇక్క‌డ ఏ స్టార్ హీరోని త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి లేదు. మ‌రి బాక్సాఫీస్ వ‌సూళ్ల‌ను బ‌ట్టి అంచ‌నా వేయోచ్చు క‌దా? దాన్ని ప్ర‌మాణికంగా తీసుకుని చెప్పొచ్చు క‌దా? అన్న సందేహాలు చాలా కాలంగా అభిమానుల్లో ఉన్నాయి. తాజాగా ఈ సందేహాలపై నిర్మాత సురేష్ బాబు కాస్త క్లారిటీ ఇచ్చారు.

`ఎవ‌రు పెద్ద హీరో అనేది ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. ప్ర‌తీ ఒక్క హీరోకి భారీ ప్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమా క‌లెక్ష‌న్లు ద‌ర్శ‌కుడిపై కూడా ఆధార‌ప‌డి ఉంటాయి. ఒక్కోసారి స్టార్ హీరోల సినిమాలు కూడా అనుకున్న‌ట్లు వ‌సూళ్లు సాధించ‌వు. అందుకే క‌లెక్ష‌న్లు ఆధారంగా పెద్ద హీరోల‌ను నిర్ణ‌యించ‌లేం. టాలీవుడ్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి భారీ ఓపెనింగ్స్ ఉంటాయి. ప్ర‌భాస్ కి కూడా అద్భుత‌మైన ఓపెనింగ్స్ ఉంటాయి.

అల్లు అర్జున్ కూడా ఇలాగే సొంతం చేసుకోగ‌ల‌రు. ప్ర‌భాస్ దేశంలో నెంబ‌వ‌ర్ వ‌న్ హీరో అని చెప్ప‌లేం. బాహుబ‌లి, క‌ల్కి మ‌ధ్య‌లో అత‌డు న‌టించిన కొన్ని సినిమాలు అంచ‌నాలు అందుకోలేదు. ఆంధ్రాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి అత్య‌ధిక పాలోయింగ్ ఉంది. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిన్న ద‌ర్శ‌కుల‌తో సినిమా చేసినా మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. అలాగ‌ని ఏ సినిమా తీసినా ప్రేక్ష‌కులు చూస్తార‌ని అనుకోకూడ‌దు.

ఎందుకంటే గ‌తంలో ఆయ‌న తీసిన చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి. జానీ అంచ‌నాలు అందుకోలేదు. ఇదే చ‌ర్చ ఇప్పుడు కోలీవుడ్ లో న‌డుస్తోంది. అజ‌య్, విజ‌య్, ర‌జ‌నీకాంత్ లో ఎవ‌రు పెద్ద హీరో అంటే చెప్ప‌లేం. ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే సినిమాలు తీస్తే ఆద‌రిస్తారు. తెలుగులో 100 కోట్లు సాధించే హీరోలు చాలా మంది ఉన్నారు` అన్నారు.

Tags:    

Similar News