సురేష్ కృష్ణ ‘నాయకి’ మతి చెడే ట్రీట్
దివ్య ఖోస్లా కుమార్ .. బాలీవుడ్ సర్కిల్స్‌లో పాపులర్ నేమ్. ఈ భామ కిల్లర్ లుక్స్, అద్భుత నటనతో భారీగా ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది.
దివ్య ఖోస్లా కుమార్ .. బాలీవుడ్ సర్కిల్స్‌లో పాపులర్ నేమ్. ఈ భామ కిల్లర్ లుక్స్, అద్భుత నటనతో భారీగా ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది. ఈ పంజాబీ బ్యూటీ 'అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో` అనే హిందీ చిత్రంతో ఆరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన జతకట్టింది. ఆ తర్వాత సత్యమేవ జయతేలో నటించింది. ఇందులో జాన్ అబ్రహం సరసన నటించింది. ఇటీవలే విడుదలైన `యారియాన్ 2`తో దివ్యకు మంచి గుర్తింపు వచ్చింది.
దివ్య ఖోస్లా కుమార్ నటిగానే కాకుండా దర్శకురాలు, నిర్మాత కూడా. యారియాన్, సనమ్ రే వంటి చిత్రాలకు ఈ ప్రతిభావని దర్శకత్వం వహించారు. అయితే 2004 సంవత్సరంలో ఉదయ్ కిరణ్ `లవ్ టుడే` చిత్రంతో టాలీవుడ్ లోను తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. దివ్య నటించిన ప్రతి సినిమాలో తన ప్రతిభతో ఆకర్షించింది. ప్రతిసారీ తనదైన నటనతో హృదయాన్ని గెలుచుకుంటుంది.
నిర్మాతగా దివ్యా ఖోశ్లాకు మంచి రికార్డ్ ఉంది. రాయ్, ఖండాని షఫాఖానా, బాట్లా హౌస్, మార్జావాన్, స్ట్రీట్ డ్యాన్సర్ 3డి, లూడో సహా మరెన్నో చిత్రాలను నిర్మించింది. సినిమాలే కాకుండా, ఆమె చాలా మ్యూజిక్ వీడియోలలో నటించింది. చాలా అవార్డులను గెలుచుకుంది. అయితే దివ్య ఖోస్లా కుమార్ టీసిరీస్ అధినేత భూషణ్ కుమార్ భార్య అనే విషయం తెలుగు సర్కిల్స్ లో తక్కువగా తెలుసు. టి సిరీస్ మేనేజింగ్ డైరెక్టర్ గాను బాధ్యతాయుతమైన పదవిలో దివ్య ఉన్నారు.
నటి కం ఎంటర్ ప్రెన్యూర్ దివ్య ఖోస్లా సురేష్ కృష్ణ దర్శకత్వంలో ప్రేరణ అరోరా నిర్మిస్తున్న `హీరో హీరోయిన్`లో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ప్రకటన వీడియో ఇంతకుముందు విడుదలై చాలా ప్రేమను పొందింది. ఇప్పుడు దివ్య ఖోస్లా కుమార్ ఫస్ట్ లుక్ మొదటి పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ లో దివ్య ఎంతో అందంగా కనిపిస్తోంది. పోస్టర్ లో బ్లాక్ కలర్ సీతాకోక చిలుకను పోలిన డిజైనర్ డ్రెస్ లో దివ్య ఎంతో ముగ్ధ మనోహరంగా కనిపించింది. ఇక ఇది తెలుగు-హిందీ ద్విభాషా చిత్రమని టీమ్ పోస్టర్ లో ప్రత్యేకంగా వెల్లడించింది. తెలుగు వెర్షన్ కి `నాయకి` అనే టైటిల్ ని ప్రకటించారు. ఈ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే రచయిత. పోస్టర్ ఆసక్తిని రేకెత్తించింది. కానీ ఈ చిత్రంలో దివ్య ఖోస్లా కుమార్ పాత్ర ఏమిటన్నది తెలియాల్సి ఉంది.