2025 పొంగల్ ఫైట్.. ఆ ఇద్దరు కూడా ఫిక్స్ అయినట్లే..

ఇదే సమయంలో కోలీవుడ్ నుంచి కూడా సంక్రాంతి రేసులో స్టార్ హీరోలు బరిలోకి దిగుతున్నారు.

Update: 2024-09-26 19:30 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలో 2025 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర, నందమూరి బాలకృష్ణ NBK 109 బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటం దాదాపు ఖాయం అయిపొయిందనే మాట వినిపిస్తోంది. అలాగే విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో రెడీ అవుతోన్న సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ కన్ఫర్మ్ అయిపొయింది. దాంతో పాటుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూవీ ఒకటి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రాబోతోందని తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే తెలుగులో సంక్రాంతి ఫైట్ మాత్రం రసవత్తరంగా ఉండబోతోందని అర్ధమవుతోంది.

ఇదే సమయంలో కోలీవుడ్ నుంచి కూడా సంక్రాంతి రేసులో స్టార్ హీరోలు బరిలోకి దిగుతున్నారు. సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘కంగువా’ మూవీ పూర్తి చేశాడు. ఈ సినిమా నవంబర్ 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. భారీ అంచనాల మధ్యలో ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతోంది. మరో వైపు కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో ‘సూర్య44’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో తన పోర్షన్ షూటింగ్ ని సూర్య కంప్లీట్ చేసేశాడని తెలుస్తోంది.

మిగిలిన పెండింగ్ షూట్ కూడా కార్తిక్ సుబ్బరాజు వీలైనంత వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారంట. ఇక ఈ సినిమాని 2025 సంక్రాంతి ఫెస్టివల్ కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ లో మరో స్టార్ హీరో అజిత్ విడామయార్చి మూవీని సైతం సంక్రాంతికి కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ‘సూర్య44’ చిత్రం కూడా అదే టైంకి ప్రేక్షకుల ముందుకొస్తే కచ్చితంగా పోటీ గట్టిగా ఉంటుందనే మాట వినిపిస్తోంది.

ఈ సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి రిలీజ్ అవ్వనున్నాయి. సూర్యకి తెలుగులో మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో మన తెలుగు స్టార్స్ హీరోలకి కూడా ఆ సినిమాతో కొంత ఎఫెక్ట్ ఉండొచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు. ‘సూర్య44’ చిత్రాన్ని వీలైనంత వేగంగా ఫినిష్ చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ పైన ఫోకస్ పెట్టాలనే ఆలోచనతో హీరో సూర్య ఉన్నారు.

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సూర్య క్యారెక్టర్ చాలా స్టైలిష్ గా ఉంటుందంట. అలాగే ఫైట్ సీక్వెన్స్ కూడా కొత్తగా ఉండబోతున్నాయనే మాట వినిపిస్తోంది. ఈ చిత్రంలో సూర్యకి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. బీస్ట్ తర్వాత తమిళంలో ఆమె చేస్తోన్న సినిమా ‘సూర్య44’ కావడం గమనార్హం. వరుస డిజాస్టర్ లతో ఉన్న పూజా హెగ్డేకి ఈ మూవీ సక్సెస్ చాలా అవసరం. ఏదేమైనా సంక్రాంతి పోటీ ఈసారి నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండనున్నట్లు అర్ధమవుతుంది.

Tags:    

Similar News