లోన్ తీర్చేందుకే తొలి సినిమా.. కట్ చేస్తే స్టార్ హీరో..!
కంగువ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న సూర్య తన కెరీర్ మొదలైన సందర్భాన్ని చెప్పి ఆడియన్స్ కు షాక్ ఇచ్చారు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటులలో ఒకరని చెప్పొచ్చు. కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న సినిమాలను కూడా చేస్తూ ఆడియన్స్ చేత సూపర్ అనేలా చేస్తారు సూర్య. తమిళ హీరోనే అయినా తెలుగులో కూడా సూర్యకు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం సూర్య కంగువ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. పీరియాడికల్ మూవీగా తెరకెక్కిన కంగువ సినిమాను శివ డైరెక్ట్ చేయగా ఈ ప్రెస్టీజియస్ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.
కంగువ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న సూర్య తన కెరీర్ మొదలైన సందర్భాన్ని చెప్పి ఆడియన్స్ కు షాక్ ఇచ్చారు. చదువు పూర్తయ్యాక గార్మెంట్ కంపెనీలో జాబ్ చేశారట సూర్య. 3 ఏళ్లు అక్కడ ఉద్యోగం చేయగా ఆయనకు 8 వేల దాకా జీతంగా ఇచ్చారట. ఐతే తల్లి కోసమే సినిమాలో నటించానని చెప్పుకొచ్చారు సూర్య. సూర్య ఫాదర్ కి తెలియకుండా తన తల్లి పాతిక వేలు బ్యాంక్ లోన్ తీసుకున్నారట. ఆ అప్పు తీర్చేందుకు సూర్య తొలి సినిమా చేశానని చెప్పారు.
సూర్య నటించిన తొలి సినిమా వసంత్ డైరెక్షన్ లో వచ్చిన ఓ నెర్రుక్కు నెర్.. ఈ సినిమాలో విజయ్ హీరోగా నటించగా సూర్య కీలక పాత్ర చేశాడు. ఆ సినిమా ద్వారా వచ్చిన పాతిక వేలు అమ్మకి ఇచ్చానని అలా మొదలైన ఈ ప్రయాణం లో తనని ఇక్కడిదాకా తీసుకొచ్చారని చెప్పుకొచ్చాడు సూర్య. సో అలా అమ్మ లోన్ తీర్చేందుకు నటుడిగా మారిన సూర్య పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోగా ఫ్యాన్స్ ని అలరిస్తున్నాడు.
కారణం ఏదైనా సరే నటుడిగా తను మారినప్పుడే తన సిన్సియర్ ఎఫర్ట్స్ వల్లే సూర్య ఇన్ని అవకాశాలు తెచ్చుకున్నాడని చెప్పొచ్చు. సూర్య మాత్రమే కాదు సూర్య బ్రదర్ కార్తి కూడా తమిళ, తెలుగు భాషల్లో అదరగొట్టేస్తున్నారు. ఈమధ్యనే కార్తి నటించిన సత్యం సుందరం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. సూర్య కార్తి ఇద్దరు కలిసి మల్టీస్టారర్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు కానీ వారిద్దరు కలిసి చేసే కథ దొరకట్లేదని టాక్.