50 వ‌య‌సులో స్టార్ హీరో సాహ‌సం?

హాలీవుడ్ క్లాసిక్ `అపోక‌లిప్టో` (2006) లాంటి ఎమోష‌న‌ల్ చిత్రానికి అభిమానిని అయ్యాన‌ని సూర్య తెలిపారు.

Update: 2024-10-23 15:30 GMT

హాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్లు `బ్రేవ్ హార్ట్` లాగా.. `లార్డ్ ఆఫ్ ది రింగ్స్`.. `గేమ్ ఆఫ్ థ్రోన్`.. లాగా ఏదైనా కొత్త‌గా చేయాల‌ని భావించిన్న‌ట్టు స్టార్ హీరో సూర్య ఇటీవ‌ల మీడియాతో వ్యాఖ్యానించారు. హాలీవుడ్ క్లాసిక్ `అపోక‌లిప్టో` (2006) లాంటి ఎమోష‌న‌ల్ చిత్రానికి అభిమానిని అయ్యాన‌ని సూర్య తెలిపారు. ఇప్పుడు అలాంటి ఒక ప్ర‌య‌త్న‌మే `కంగువ‌`. ద‌రువు శివ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

దాదాపు 30 పైగా భాష‌ల్లో ఈ సినిమాని రిలీజ్ చేయ‌నున్నార‌ని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చాయి. దానికి త‌గ్గ‌ట్టుగా సినిమాకి ప్ర‌చారం సాగిస్తోంది టీమ్. సూర్య ఇటీవ‌ల‌ ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు. తాజాగా మీడియాతో సూర్య మాట్లాడుతూ ``మంచి సినిమాల కోసం శ్ర‌మిస్తున్నాను. 49 ఏళ్ల వయసు(50కి చేరువ‌)లో కంగువ కోసం సిక్స్ ప్యాక్ చేశాను``అని తెలిపారు. విమానంలో త‌న‌ను క‌లిసిన‌ప్పుడు సూప‌ర్ స్టార్ రజనీకాంత్ సార్ ``నువ్వు హీరోవి.. నటుడివి. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. కంగువ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను`` అని సూర్య అన్నారు. కంగువా విజ‌యంపై సూర్య పూర్తిగా న‌మ్మ‌కంగా ఉన్న‌ట్టు తెలిపాడు.

కంగువ అలాంటి న‌మ్మ‌కాన్నిచ్చింది:

హాలీవుడ్‌ ఇతిహాసాలైన బ్రేవ్‌హార్ట్‌, లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌, అపోక‌లిప్టో(2006)తో సమానంగా భారతీయ ప‌రిశ్ర‌మ ఎప్పుడు సినిమాలు తీస్తుందోనని తాను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడినని, ఇంత‌కాలానికి తనకు అలాంటి అవకాశం వచ్చిందని సూర్య తాజా ఇంట‌ర్వ్యూలో అన్నారు. కంగువ అలాంటి న‌మ్మ‌కాన్ని ఇచ్చింద‌ని అన్నారు.

దర్శకుడు శివ విజన్ ని ప్రశంసిస్తూ.. అత‌డు తమిళ ప‌రిశ్ర‌మ‌కు భవిష్యత్తు అని, ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని కొత్త సినిమాని అందిస్తున్నాడ‌ని అన్నారు. కంగువ నవంబర్ 14న విడుదల కానుంది. ఇది ఒక యోధుని కథ.. చారిత్ర‌క క‌థ‌తో రూపొందింది. బాబీ డియోల్ విల‌న్ గా న‌టించారు. ఈ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. దిశా పటాని కథానాయిక. యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ సినిమా కోసం భారీ బ‌డ్జెట్ ని వెచ్చించాయి.

హాలీవుడ్ లో గొప్ప‌ చిత్రాలను , అందులో న‌టుల గొప్ప‌ ప్రదర్శనలను చూసి మ‌నం ఎంతో ఇష్టపడ్డాము. మంత్రముగ్ధులయ్యాము.. ఆ సినిమాల‌ను చాలాసార్లు చూశాము. ఆ స‌మ‌యంలో మనం ఎప్పుడు అలాంటి సినిమాలు చేస్తాము అని ఆలోచించేవాడిని అని కూడా సూర్య అన్నారు. మనం కొన్ని వంద‌ల‌ సంవత్సరాలు వెనక్కి వెళితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన శివకు వచ్చింది... మన ప్రజలు ఆరోజుల్లో అలాంటి జీవితాన్ని గడుపుతూ, సంక్లిష్టమైన పరిస్థితిల్లో ఉండి ఉంటే ఏం జరుగుతుంది? అనేది తెర‌పై చూపించ‌మ‌ని అన్నట్టు తెలిపారు.

Tags:    

Similar News