కంగువా.. అసలు కండిషన్ కు గ్రీన్ సిగ్నల్
సూర్య కంగువా సినిమాకి అలాంటి పరిస్థితి ఎదురవుతుందని అందరూ భావించారు. అయితే ఓటీటీ రైట్స్ కోసం కంగువా నిర్మాతలు థియేటర్స్ కలెక్షన్స్ ని పోగొట్టుకోవాలని అనుకోవడం లేదంట.
సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన కంగువా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాని అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియన్ భాషలలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ గట్టిగా వర్క్ చేస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ బేస్డ్ గా సరికొత్త ఫాంటసీ వరల్డ్ లో ఈ కంగువా కథని శివ చెబుతున్నారు. సినిమాలో సూర్య ట్రైబల్ వారియర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
దీంతో దేశ వ్యాప్తంగా కంగువా చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇదిలా ఉంటే నార్త్ లో మల్టీప్లెక్స్ థియేటర్స్ అసోసియేషన్ పెట్టిన రూల్స్ కాస్తా సౌత్ నుంచి రిలీజ్ అయ్యే పాన్ ఇండియా చిత్రాలకి ఇబ్బందిగా మారాయి. నార్త్ లో మల్టీ ప్లెక్స్ చైన్స్ లో సినిమాని ప్రదర్శించాలంటే 8 వారాల తర్వాత మాత్రమే ఓటీటీలో రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనకి ఒప్పుకుంటేనే అక్కడ మల్టీప్లెక్స్ లలో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు.
ఒకవేళ ఒప్పుకోకపోతే మల్టీప్లెక్స్ లలో ఆ సినిమాలని ప్రదర్శించడం లేదు. తమిళంలో దళపతి విజయ్ లియో, GOAT సినిమాలు రెండు కూడా హిందీలో మల్టీప్లెక్స్ పెట్టిన 8 వారాల నిబంధనకి అంగీకరించలేదు. దీంతో ఆ సినిమాల హిందీ వెర్షన్స్ ని 3 మల్టీప్లెక్స్ చైన్ థియేటర్స్ లో ప్రదర్శించలేదు. కేవలం సింగిల్ స్క్రీన్స్ కి మాత్రమే ఆ సినిమాలు పరిమితం అయ్యాయి.
సూర్య కంగువా సినిమాకి అలాంటి పరిస్థితి ఎదురవుతుందని అందరూ భావించారు. అయితే ఓటీటీ రైట్స్ కోసం కంగువా నిర్మాతలు థియేటర్స్ కలెక్షన్స్ ని పోగొట్టుకోవాలని అనుకోవడం లేదంట. అందుకే కంగువా నిర్మాతలు మల్టీప్లెక్స్ అసోసియేషన్ పెట్టిన కండిషన్ కి ఒప్పుకున్నారంట. దీంతో నార్త్ ఇండియాలో అన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్ లలో కంగువా రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ అధికారికంగా కన్ఫర్మ్ చేసింది.
అలాగే మేగ్జిమమ్ అక్టోబర్మ్ 10న రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంట. ఒకవేళ సూపర్ స్టార్ రజినీకాంత్ వేట్టయాన్ సినిమా పోటీలో ఉంటే రేసు నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నారంట. దీనికోసం మరో డేట్ ని కూడా కంగువా మేకర్స్ లాక్ చేయాలని అనుకుంటున్నారంట. అనుకున్న డేట్ కు నెల రోజుల టైమ్ మాత్రమే ఉంది కాబట్టి త్వరలోనే రెగ్యులర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు.