రోలెక్స్ (X) దిల్లీ: ఇద్దరూ ఇద్దరే బ్రో
రోలెక్స్ వర్సెస్ దిల్లీ.. ఇద్దరూ ఇద్దరే బ్రో. కలిసి మొదలుపెట్టారు.. కలిసే ఎదిగారు.. కలిసి చాలా విజయాలకు బాటలు వేసారు.
రోలెక్స్ వర్సెస్ దిల్లీ.. ఇద్దరూ ఇద్దరే బ్రో. కలిసి మొదలుపెట్టారు.. కలిసే ఎదిగారు.. కలిసి చాలా విజయాలకు బాటలు వేసారు. ఇండస్ట్రీలో ఈ అన్నదమ్ముల స్టైలే వేరు. ఇద్దరూ మాస్ యాక్షన్ సినిమాలతో అదరగొట్టేస్తున్నారు. మళ్లీ ఏదో ఛాలెంజ్ కి రెడీ అవుతున్న ఈ బ్రదర్స్ ఇంతకీ ఎక్కడికి వెళుతున్నారు?
ది గ్రేట్ సూర్య, అతడి సోదరుడు కార్తీ.. ఒకే విమానంలో కలిసి ప్రయాణిస్తుంటే, అభిమానులు ఆ ఇద్దరూ ఎక్కడికి బయల్దేరారు? అంటూ ఆరాలు తీస్తున్నారు. కలిసి బయల్దేరారు.. ఏంటి బ్రో.. ఏదో మాస్టర్ ప్లాన్ తో వెళుతున్నట్టున్నారు? పెద్ద స్కెచ్ ఏదో వేసినట్టే ఉన్నారు! అంటూ అభిమానులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
అన్న సూర్య లానే ఛాలెంజింగ్ పాత్రల్లో నటిస్తూ కార్తీ ఇటీవల బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నాడు. అతడు నటించిన ఖైదీ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు కార్తీ ఈ సినిమా సీక్వెల్ కోసం రెడీ అవుతున్నాడు. తన దిల్లీ పాత్రకు కొనసాగింపు సవాల్ ఎలా ఉంటుందో తెరపై చూడాలి. అంతకుముందే కార్తీ వా వాతియార్, సర్ధార్ 2 చిత్రాలతో అభిమానుల ముందుకు రానున్నాడు.
అదే సమయంలో సూర్య రెట్రో చిత్రీకరణ ముగించి, తన రోలెక్స్ పాత్రలో నటించేందుకు ప్రిపరేషన్ లో ఉన్నాడు. లోకేష్ కనగరాజ్ కూలీ (రజనీ) సినిమాని పూర్తి చేసి సూర్యతో షెడ్యూళ్లను ప్లాన్ చేస్తాడని టాక్ ఉంది. విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో క్రూరుడైన రోలెక్స్ పరిచయం ఆశ్చర్యపరిచింది. కొనసాగింపు భాగంలో సూర్య భారీ సర్ ప్రైజ్ ఇస్తాడని అభిమానులు భావిస్తున్నారు. తాడిని తన్నేవాడొకడుంటే, వాడి తలదన్నేవాడొకడుంటాడు! అని రోలెక్స్ నిరూపిస్తాడు. జస్ట్ వెయిట్...!