రోలెక్స్.. ఫ్యాన్స్ ఆకలి తెలిసేలా చేసిందా..?

ఈ సినిమాను హిందీలో గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు సూర్య అండ్ టీం.

Update: 2024-10-23 23:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన లేటెస్ట్ మూవీ కంగువతో త్వరలో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయబోతున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో నవంబర్ 14న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను హిందీలో గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు సూర్య అండ్ టీం. కోలీవుడ్ సినిమాలు హిందీ వెర్షన్ రిలీజ్ అవుతున్నా కూడా తెలుగు సినిమాలు చేసే రేంజ్ లో ప్రమోషన్స్ చేయట్లేదు అన్న టాక్ ఉని. అందుకే తమిళ సినిమాలు ఎక్కువగా హిందీ లో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాయి. సరైన ప్రమోషన్స్ లేకపోవడం వల్లే అలా జరుగుతుందని గుర్తించిన కంగువ టీం ఎక్కువ ఫోకస్ అక్కడ చేయాలని ఫిక్స్ అయ్యింది.

ఈ క్రమంలో సూర్య కంగువ టీం ముంబైలో ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఐతే ఈ సందర్భంగా కంగువ సినిమా తీయడానికి వెనక రీజన్ వెల్లడించారు సూర్య. హాలీవుడ్ సినిమాలు చూస్తున్న టైం లో మనం ఎందుకు ఇలాంటి సినిమాలు చేయలేకపోతున్నా అని భావన కలిగింది. అందుకే శివ కథ చెప్పగానే ఓకే చేశానని అన్నారు. కెరీర్ లో సూరరై పోట్రు ముందు కథల విషయంలో రకరకాల ఆలోచనలు ఉన్నాయి. ఎప్పుడైతే సూరరై పోట్రు చేశానో అప్పటి నుంచి మంచి కథలు వస్తున్నాయని అన్నారు.

ఇక రోలెక్స్ పాత్ర గురించి మొదటిసారి స్పందించిన సూర్య రోలెక్స్ రోల్ కి ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని అసలు ఊహించలేదు. హాఫ్ డే పూర్తి చేసిన ఈ పాత్ర ఈ రేంజ్ రెస్పాన్స్ అందుకోవడం తనని సర్ ప్రైజ్ చేసిందని అన్నారు. లోకేష్ కనకరాజ్ ఈ పాత్రని చాలా బాగా రాసుకున్నారు. కంగువ సినిమా ప్రేక్షకులకు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని అన్నారు సూర్య. 1000 ఏళ్ల నాటి కథతో కంగువ ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుందని అన్నారు సూర్య.

సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. కంగువ సినిమా మీద సూర్య చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా తో సూర్య మరోసారి తన విశ్వరూపం చూపించనున్నారని తెలుస్తుంది. సూర్య కొన్నాళ్లుగా మాస్ రోల్స్ కి దూరంగా ఉన్నారు. ఐతే అందుకే విక్రం సినిమాలో రోలెక్స్ పాత్రలో అదరగొట్టారు. సూర్య ఫ్యాన్స్ కి ఆకలి తెలిసేలా చేసింది రోలెక్స్ పాత్ర. సో ఫుల్ లెంగ్త్ రోల్ లో సూర్య రోలెక్స్ గా కనిపిస్తే ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే లెక్క.

Tags:    

Similar News