ఆ సినిమాలో హీరో-విలన్ ఒక్కడేనా!
కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా 45వ చిత్రం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా 45వ చిత్రం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇది హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇంతకాలం నటుడిగా కొనసాగిన బాలాజీ తొలిసారి సూర్య సినిమాతో కెప్టెన్ కుర్చీ ఎక్కుతున్నాడు. నటుడిగా అతడికి మంచి పేరుంది. ఇప్పుడు దర్శకుడిగానూ సత్తా చాటే క్రమంలో సూర్య ని తన కథతో ఒప్పించి మెప్పించాడు. ఇంత వరకూ దర్శకుడిగా పనిచేసిన అనుభవం లేదు.
అయినా సూర్య స్టోరీ సహా అతడిపై నమ్మకంతో ఛాన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం సినిమా సెట్స్ లో ఉంది. అయితే ఈ సినిమాలో హీరో? విలన్ ఒక్కరే అంటూ కోలీవుడ్ మీడియాలో చర్చ జరుగుతోంది. సినిమాలో సూర్య హీరోగా, విలన్ గా రెండు పాత్రలు పోషిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. తొలుత విలన్ పాత్రలో ఆర్జే బాలాజీ పోషిస్తున్నట్లు వినిపించింది. కానీ ఏకకాలంలో దర్శకత్వంతో పాటు నటించడం కష్టమని భావించిన బాలాజీ విలన్ పాత్ర కూడా సూర్యతో చేయిస్తే బాగుంటుందని భావించి ముందుకెళ్తున్నాడుట.
సూర్య కూడా తొలుత విలన్ పాత్రకు నో సందేహించాడుట. కానీ బాలాజీ కనిన్స్ చేయడంతో? ఒప్పుకున్నట్లు సమాచారం. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి. ఇలా డ్యూయల్ రోల్ పోషించడం సూర్యకి కొత్త కాదు. గతంలో కొన్ని సినిమాల్లో పోషించారు. విక్రమ.కె. కుమార్ దర్శకత్వం వహించిన `24` లో హీరోగా, విలన్ గా సూర్య నటించిన సంగతి తెలిసిందే. రెండు పాత్రల్లోనూ తనదైన పెర్పార్మెన్స్ తో ఆకట్టుకున్నారు.
ముఖ్యంగా అందులో విలన్ పాత్రకు సూర్యకి మంచి పేరొచ్చింది. అటుపై లోకేషన్ కనగరాజ్ తెరకెక్కించిన `విక్రమ్` సినిమాలోనూ డ్రగ్స్ మాఫియా కింగ్ రోలెక్స్ పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర పాన్ ఇండియాలో ఓ సంచలనం అయింది. దీంతో రోలెక్స్ టైటిల్ తోనే లోకేష్ కనగరాజ్ ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.