సూర్యకి కూడా కోపం వస్తుందా.. అదేంటి డౌటా..?

సూర్య గురించి ఎవరు చెప్పినా కాం అండ్ సైలెంట్.. అసలు అంత మంచోడు ఏంటి బాబు అంటుంటారు.

Update: 2024-10-27 09:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన ప్రతి సినిమాతో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. మెయిన్ స్ట్రీమ్ హీరోగా ఎంచక్కా కమర్షియల్ సినిమాలు చేస్తే ఇమేజ్ కి ఇమేజ్ డబ్బుకి డబ్బు వస్తుంది కానీ సూర్య సినిమా అంటే కేవలం డబ్బు ఒక్కటే కాదు ప్రేక్షకులను ఎంతోకొంత ఇన్ స్పైర్ చేయాలన్న తపనతో ఉంటాడు. అందుకే ఆయన సినిమాలన్నీ డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ తో వస్తుంటాయి. కమర్షియల్ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టడం ఏ స్టార్ అయినా చేస్తాడు కానీ జై భీం లాంటి సినిమా తీసి సూపర్ అనిపించడం మాత్రం సూర్య లాంటి హీరోల వల్లే అవుతుంది.

సూర్య గురించి ఎవరు చెప్పినా కాం అండ్ సైలెంట్.. అసలు అంత మంచోడు ఏంటి బాబు అంటుంటారు. కానీ ఐదారేళ్ల క్రితం వరకు సూర్యకు కోపం వచ్చేదట. తన సినిమా కింద నెగిటివ్ కామెంట్స్ చేసిన వారి మీద కోపం వచ్చేదట. ఎవరైనా తన మీద నెగిటివ్ కామెంట్ చేస్తే విక్రం లోని రోలెక్స్ లా మారిపోతానని అన్నారు. ఐతే కంగువ డైరెక్టర్ శివ పరిచయం అయ్యాక క్షమించడం అంటే ఏంటో తెలుసుకున్నా అని అన్నారు. కంగువ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో ఫ్యాన్స్ ని ఉత్సాహపరచే స్పీచ్ తో అలరించాడు సూర్య.

ఎవరు మిమ్మల్ని ప్రేమించినా.. ధ్వేషించినా.. ప్రేమను మాత్రమే తీసుకుని ధ్వేషాన్ని వదిలేయండి.. నెగిటివ్ కామెంట్స్ కు రిప్లై ఇచ్చుకుంటూ వెళ్తే టైం వేస్ట్ అవుతుందని ఫ్యాన్స్ కి మంచి మెసేజ్ ఇచ్చారు సూర్య. తను నటించే సినిమాలో హీరోలానే బయట కూడా హీరో ఎప్పుడు ప్రేక్షకులను ముఖ్యంగా తన అభిమానులను చాలా బాధ్యతగా ఉండాలని చెబుతుంటారు. ఒకరికి మనం ఏదైనా చెప్పేముందు దాన్ని మనం పాటించాలి ఆ విషయంలో సూర్య తన ఫ్యాన్స్ కి ఎంతో స్పూర్తిగా నిలుస్తాడని చెప్పొచ్చు.

ఇక ఇదే స్పీచ్ లో రాజకీయంగా ముందడుగు వేస్తున్న తన తోటి హీరోలు ఉదయనిధి స్టాలిన్, విజయ్ లకు ప్రత్యేక విషెస్ అందించాడు సూర్య. కంగువ సినిమా తన కెరీర్ లో ప్రత్యేకమైన సినిమా అని ఈ సినిమా తప్పకుండా పేక్షకులను అలరిస్తుందని చెబుతున్నారు సూర్య.

సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటించిన కంగువ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. కంగువ ఆడియో రిలీజ్ ఈవెంట్ లో కూడా దేవి శ్రీ ప్రసాద్ లైవ్ షో ఆడియన్స్ ని అలరించింది. నవంబర్ 14న రిలీజ్ అవుతున్న కంగువ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాబీ డియోల్ నటించారని తెలిసిందే.

Tags:    

Similar News