టైటిల్ తగ్గ లుక్ లోనే కోలీవుడ్ హీరో
ఇదిలా ఉంటే రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సెట్స్ నుంచి కొన్ని స్టిల్స్ ను రిలీజ్ చేసింది.;

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా వస్తోన్న సినిమా రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా గ్యాప్ తర్వాత పూజా సౌత్ లో చేస్తున్న సినిమా ఇది. కార్తీక్ సుబ్బరాజ్- సూర్య కాంబోలో వస్తున్న సినిమా కావడంతో రెట్రో పై అందరికీ మంచి అంచనాలున్నాయి.

ఆ అంచనాలకు తగ్గట్టే టీజర్ కు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మొన్నీమధ్యే రెట్రో మూవీ నుంచి సాంగ్ రిలీజ్ కాగా ఆ సాంగ్ సినిమాపై హైప్ ను పెంచింది. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సెట్స్ నుంచి కొన్ని స్టిల్స్ ను రిలీజ్ చేసింది.

ఈ స్టిల్స్ లో అటు సూర్య, ఇటు పూజా చాలా కొత్తగా అందంగా కనిపిస్తున్నారు. సినిమా టైటిల్ కు తగ్గట్టే వారి లుక్ కూడా చాలా పాతగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా పూజాకు ఈ లుక్ చాలా బాగా సెట్టయిందని చెప్పొచ్చు. రెట్రో మూవీని 2డీ ఎంటర్టైన్మెంట్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మించాయి.

కంగువ డిజాస్టర్ తర్వాత సూర్య నుంచి వస్తున్న సినిమా కావడంతో అతని ఫ్యాన్స్ ఆశలన్నీ రెట్రో పైనే ఉన్నాయి. ఈ మూవీలో నాజర్, జయరామ్, ప్రకాష్ రాజ్, కరుణాకరన్, విద్యాశంకర్, జోజు జార్జ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం రెట్రో మూవీకి సంబంధించిన స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.