సూర్య తెలుగు ప్రేమ.. ఈసారి గట్టిగా ఫిక్స్ అయ్యాడా..?
ఐతే సూర్య సినిమాలు అంటే తెలుగు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఉంటారు. గజిని సినిమా నుంచి సూర్య ఎలాంటి ప్రాజెక్ట్ తో వచ్చినా అలర్ట్ అవుతుంటారు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కంగువ రిజల్ట్ తర్వాత ఒక క్లారిటీకి వచ్చినట్టు ఉన్నాడు. కథ బాగున్నా కూడా దాన్ని చెప్పింది చెప్పినట్టు తీయగలిగే డైరెక్టర్ ఉన్నప్పుడే రిస్క్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఐతే తన నెక్స్ట్ సినిమా కార్తీక్ సుబ్బరాజుతో తీస్తున్నాడు సూర్య. రెట్రో అంటూ మరోసారి వింటేజ్ సూర్యని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే సూర్య సినిమాలు అంటే తెలుగు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఉంటారు. గజిని సినిమా నుంచి సూర్య ఎలాంటి ప్రాజెక్ట్ తో వచ్చినా అలర్ట్ అవుతుంటారు.
ఐతే సూర్య రెట్రో సినిమా విషయంలో తెలుగు ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని కూడా మూవీని చేస్తున్నారట. సూర్య సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతుంటాయి. సూర్యకి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలిసినా అతను తెలుగు సరిగా మాట్లాడడు. ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాడు. ఇక తెలుగు సొంత డబ్బింగ్ చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు కానీ అది పైపైన చెప్పినట్ట్ అనిపిస్తుంది.
ఐతే రెట్రో సినిమా తన ఫ్యాన్స్ ఎలాంటి అంచనాలతో ఉన్నారో అలాంటి సినిమా అని తెలుసుకున్న సూర్య ఈసారి తెలుగు డబ్బింగ్ విషయంలో చాలా జాగ్రత్త పడాలని అనుకుంటున్నాడట. డబ్బింగ్ విషయంలో ఈసారి పర్ఫెక్ట్ ప్లాన్ తో వెళ్తున్నట్టు తెలుస్తుంది. సూర్య మాత్రమే కాదు కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలకు తెలుగులో మంచి ఫ్యాన్స్ ఉన్నారు. సో సూర్య తో అతను చేస్తున్న సినిమా అంటే నెక్స్ట్ లెవెల్ అంచనాలు ఉంటాయి.
అందుకే ఈ కాంబో సినిమాను అటు తమిళ్ లో ఎలాగైతే భారీ రిలీజ్ ఉండేలా చేస్తున్నారో తెలుగులో కూడా అదే చేస్తున్నారట. ఈసారి తెలుగు వెర్షన్ మీద కూడా సూర్య స్పెషల్ ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది. సూర్య రెట్రో సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను మే 1న రిలీజ్ లాక్ చేశారు. కంగువ వల్ల పూర్తిగా నిరుత్సాహపడ్డ సూర్య ఈ సినిమాతో డబుల్ ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఎలాగు అక్కడ ఉంది కార్తీక్ సుబ్బరాజు కాబట్టి ఏం చేస్తాడో చూడాలి.