మీ భర్తను నాకు అప్పుగా ఇస్తారా?
అందులో సూర్య లేడీ అభిమాని ఒకరు జ్యోతిక ముందుకు ఇంట్రెస్టింగ్ ప్రపోజల్ తీసుకెళ్లింది.
కోలీవుడ్ ఆదర్శ దంపతులుగా వెలిగిపోతున్న సూర్య- జ్యోతికల గురించి చెప్పాల్సిన పనిలేదు. సూర్య స్టార్ హీరోగా కొనసాగుతుంటే..ఇటీవలే జ్యోతిక కూడా కంబ్యాక్ అయి సినిమాలు చేస్తుంది. వివాహం అయిన తర్వాత కొన్నాళ్ల పాటు కుటుంబానికే సమయం కేటాయించిన జ్యోతిక మళ్లీ ఇప్పుడు వరుసగా సినిమాలు చేయడంతో అభిమానుల్లో అనందం కనిపిస్తుంది. లేడీ ఓరియేంటెడ్ చిత్రాలతో ఆమె బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది.
ఇటీవల హిందీలో సినిమాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాపురం ముంబైకి మార్చిన తర్వాత బాలీవుడ్ సినిమాలపైనా పోకస్ పెట్టి పనిచేస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన 'షైతాన్' తో మంచి విజయం అందుకుంది.ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద 150 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇటీవల ఈ సినిమా విజయోత్స వేడుకలకు కూడా ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సూర్యతో కలిసి దిగిన కొన్ని ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అందులో సూర్య లేడీ అభిమాని ఒకరు జ్యోతిక ముందుకు ఇంట్రెస్టింగ్ ప్రపోజల్ తీసుకెళ్లింది. 'జ్యోతిక మేడమ్.. 'సిల్లును ఒరు కాదల్' సినిమాలో లాగా మీ భర్తను ఒకరోజు నాకు అప్పుగా ఇస్తారా? 15 ఏళ్లుగా ఆ జెంటిల్మెన్కు పెద్ద అభిమానిని' అని కామెంట్ చేసింది. దీనికి జ్యోతిక.. 'అలాంటివేమీ కుదరదమ్మా' అని రిప్లై ఇచ్చింది. జ్యోతిక రిప్లై చూసిన అభిమాని అనందంతో ఉబ్బితబ్బిబింది. 'నేను సూర్యకు ఎంత పెద్ద అభిమానినో మీరు అసలు ఊహించి ఉండరు.
నా పేరులో కూడా అతడి పేరును యాడ్ చేశాను. ఆయనే నా ఫస్ట్ లవ్.. నేను ఆయన్ను ఎంతగానో ప్రేమి స్తున్నాను ఆరాధిస్తున్నాను. ఈ విషయం ఆయనకు చెప్పండి. అయినా మీరు పంచే ప్రేమ ముందు నాదెంత' అని మరో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. సూర్యని ఆ లేడీ అభిమాని ఎంతగా అభిమానిస్తుందో? ఆ పోస్టులు చూస్తే అర్ధమవుతుంది.