రానా టాక్ షోలో స‌ర్‌ప్రైజింగ్ క‌పుల్‌

రానా కొత్త షో అతిథుల జాబితాలో అద్భుత‌మైన లైన‌ప్ ఉంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

Update: 2024-09-12 17:58 GMT

వెండితెర న‌ట‌న‌తో పాటు హోస్ట్ గాను రాణించిన అరుదైన హీరోల‌లో రానా ఒక‌డు. అత‌డి ఆల్ రౌండ‌ర్ నైపుణ్యం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. గతంలో 'నెం. 1 యారి' వంటి విజయవంతమైన టాక్ షోలను హోస్ట్ చేసిన రానా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ కోసం మ‌రో ఆస‌క్తిక‌ర టాక్ షోని ప్రారంభిస్తాడ‌ని స‌మాచారం.

రానా కొత్త షో అతిథుల జాబితాలో అద్భుత‌మైన లైన‌ప్ ఉంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. నంద‌మూరి బాల‌కృష్ణ, క‌ర‌ణ్ జోహార్ లాంటి ప్ర‌ముఖుల‌తో పాటు చై-శోభిత జంట‌తో ఎపిసోడ్ ప్ర‌ధాన హైలైట్ గా నిలుస్తుంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే నిశ్చితార్థం అయి పెళ్లికి రెడీ అవుతున్న జంటకు రానా ఎలాంటి ప్ర‌శ్నలు సంధిస్తాడో తెలీదు కానీ, ఇలాంటి ఒక ఎపిసోడ్ కోసం అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తార‌న‌డంలో సందేహం లేదు.

ఇక స‌మంత‌తో బ్రేక‌ప్ అయ్యాక చైత‌న్య వేరొక క‌థానాయిక‌తో ప్రేమ‌లో ఉన్నాడంటూ ప్ర‌చారం సాగింది. నిశ్చితార్థానికి ముందే శోభిత‌తో నాగ‌చైత‌న్య స‌న్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. ఆ ఇద్ద‌రిపైనా కొన్ని నెల‌ల పాటు గాసిప్పులు షికార్ చేసాయి. కానీ వాటిని ఏనాడూ ఆ ఇద్ద‌రూ ఖండించ‌లేదు. చివ‌రికి ఒక ముఖ్య‌మైన రోజున నిశ్చితార్థంతో వారి ప్రేమ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది. త్వ‌ర‌లోనే ఈ జంట పెళ్లికి రెడీ అవుతోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. రానా యుడు సీజ‌న్ 2 త‌ర్వాత రానా ఎలాంటి చిత్రంలో న‌టిస్తాడో చూడాలి. అత‌డు హిర‌ణ్య‌క‌శిప‌ను ప్రారంభించి చాలా కాల‌మే అయినా కానీ, దానిపై మ‌ళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. కోవిడ్ వ‌ల్ల ఆగిపోయింద‌ని గుణ‌శేఖ‌ర్ అన్నారు. ఆ త‌ర్వాత గుణ‌శేఖ‌ర్ చేతుల నుంచి మారింద‌ని క‌థ‌నాలొచ్చాయి. దీనిపై వివాదం మొద‌లైంది. కానీ చివ‌రికి దీనిని ఆపేశారా? లేక మ‌ళ్లీ రానా కొన‌సాగిస్తాడా? అన్న‌దానిపై స్ప‌ష్ఠ‌త లేదు.

Tags:    

Similar News