సూర్య కల్ట్ బొమ్మ చూపించేందుకు రెడీ..!

కంగువ తర్వాత సూర్య కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

Update: 2024-12-24 11:30 GMT

కోలీవుడ్ స్టార్ సూర్య కంగువ ఇచ్చిన షాక్ నుంచి బయటకు వచ్చాడు. శివ డైరెక్షన్ లో భారీ అంచనాలతో తెరకెక్కిన కంగువ సినిమా అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. అందుకే సినిమాకు అన్ని చోట్ల తగిన రెస్పాన్స్ రాలేదు. తమిళ తంబీలు ఈ సినిమా మీద భారీ హోప్స్ పెట్టుకున్నా కూడా అవి నెరవేరలేదు. కంగువ తర్వాత సూర్య కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.


ఈ సినిమాను లవ్ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే సూపర్ బజ్ ఏర్పరచుకుంది. కార్తీక్ సుబ్బారాజ్ మేకింగ్ స్టైల్ కి కోలీవుడ్ లో సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా అతని సినిమా ల్లో మాస్ యాక్షన్ కూడా బలమైన ఎమోషన్ ఉంటుంది. సూర్య 44 సినిమాకు కూడా అదే ప్లస్ అయ్యేలా ఉందని అంటున్నారు. సూర్య 44 సినిమా కు టైటిల్ గా రెండు పేర్లు ఫైనల్ చేసి పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ రెండు టైటిల్స్ కూడా మీడియాకు లీక్ అయ్యాయి.

సూర్య 44 సినిమాకు కార్తీక్ మొదటగా జానీ అనే టైటిల్ అనుకుంటున్నారని తెలుస్తుంది. జానీ అంటే రజిని ఒకప్పటి సూపర్ హిట్ సినిమా.. అంతేకాదు పవర్ స్టార్ కూడా ఆ టైటిల్ తో సినిమా తీశాడు. ఒకవేళ అది కాదు అనుకుంటే మాత్రం కల్ట్ అనే టైటిల్ పరిశీలన చేస్తున్నారట. జానీ, కల్ట్ రెండు టైటిల్స్ సూర్య ఫ్యాన్స్ కి నచ్చేశాయ్ అయితే.. ఫ్యాన్స్ ఎక్కువ మంది మాత్రం మెజారిటీ గా కల్ట్ టైటిల్ కి థమ్స్ అప్ చెప్పేస్తున్నారు.

సూర్య కార్తీక్ సుబ్బరాజు కాంబో సినిమాకు కల్ట్ టైటిల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పొచ్చు. ఈ సినిమా లో సూర్య వింటేజ్ మాస్ లుక్ తో ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ అందిస్తారని తెలుస్తుంది. సినిమా లో సూర్య సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో అమ్మడు గ్లామర్ పరంగా కూడా వేరే లెవెల్ లో ఉండబోతుందని టాక్. మరి సూర్య కల్ట్ బొమ్మ చూసేందుకు ఫ్యాన్స్ అంతా రెడీ గా ఉన్నారు. సినిమా అంచనాలకు మించి ఇచ్చేందుకు వాళ్లు సిద్ధం అవ్వాల్సి ఉంటుంది. సూర్య 44 టైటిల్ ని క్రిస్మస్ కానుకగా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఈ మూవీని 2025 మార్చి లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News