స్టార్ కపుల్ విడాకుల పుకార్లకు వీడియో సమాధానం..!
తమిళ స్టార్ హీరో సూర్య మరియు ఆయన భార్య జ్యోతిక విడి పోయారు అంటూ గత కొన్నాళ్లుగా తమిళ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.
తమిళ స్టార్ హీరో సూర్య మరియు ఆయన భార్య జ్యోతిక విడి పోయారు అంటూ గత కొన్నాళ్లుగా తమిళ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. జాతీయ మీడియాలో కూడా ఈ విషయమై కొన్ని కథనాలు వచ్చాయి. ఇటీవల జ్యోతిక స్పందిస్తూ తాము విడి పోలేదు అని, తన పిల్లలు మరియు తల్లిదండ్రుల కోసం తాను ముంబైలో ఉంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.
జ్యోతిక ఇచ్చిన క్లారిటీని కొందరు నమ్మలేదు. తాజాగా మరోసారి జ్యోతిక పుకార్లకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించింది. జ్యోతిక ఇన్ స్టా లో ఒక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో లో సూర్య మరియు జ్యోతిక లు హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఫిన్ లాండ్ లో ఐస్ పర్వతంపై అద్భుతమైన వాతావరణంలో ఇద్దరు సరదగా గడిపిన వీడియో వైరల్ అవుతోంది.
విడాకులు అంటూ ప్రచారం చేసిన వారికి ఈ వీడియో చెంప దెబ్బ అన్నట్లుగా సూర్య ఫ్యాన్స్ కూడా ఆ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో జ్యోతిక ముంబైలో ఎక్కువ సమయం గడుపుతుంది అంటూ ఆ ఫ్యామిలీకి చెందిన కొందరు సన్నిహితులు మీడియా ముందు ఆఫ్ ది రికార్డ్ చెప్పారట.
మొత్తానికి సూర్య మరియు జ్యోతికలు విడిపోలేదు. ఇద్దరు కూడా కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్నారు. సూర్య తమిళ సినిమాలతో బిజీగా ఉంటే, హిందీతో పాటు తమిళ సినిమాల్లో నటిస్తూ జ్యోతిక బిజీగా ఉంది. అంతే తప్ప వారిద్దరి విడి పోలేదు అని తేలిపోయింది.
కెరీర్ లో చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత జ్యోతిక మళ్లీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తోంది. వయసుకు తగ్గ పాత్రలు చేయడం ద్వారా అభిమానులను సొంతం చేసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా ఈ స్థాయిలో వరుసగా సినిమాలు చేస్తున్న జ్యోతిక తన కుటుంబంకు కూడా సమ ప్రాముఖ్యత ఇస్తూ ఉందని ఫ్యామిలీ మెంబర్స్ చెబుతూ ఉన్నారు.