సూర్య‌- మ‌హేష్ స్కూల్ మేట్స్!

అక్క‌డ ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ప‌ద‌వ‌త‌ర‌గ‌తి వ‌ర‌కూ చ‌దువుకున్నా.

Update: 2024-07-28 08:49 GMT

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌- కోలీవుడ్ స్టార్ సూర్య‌- మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్ శంక‌ర్ రాజా ఒకే స్కూల్లో చ‌దువుకున్నారా? బాల్యంలో ముగ్గురు క్లోజ్ గా ఉండేవారా? అంటే అవుననే తెలుస్తోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సూర్య రివీల్ చేసారు. అవేంటో ఆయ‌న మాట్లోనే... చెన్నై సెయింట్ బీడ్స్ స్కూల్ వైపు వెళ్తే అన్ని చిన్న నాటి జ్ఞాప‌కాలు గుర్తొస్తాయి. అక్క‌డ ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ప‌ద‌వ‌త‌ర‌గ‌తి వ‌ర‌కూ చ‌దువుకున్నా.

మ‌హేష్‌, యువ‌న్ శంక‌ర్ రాజా క్లాస్ మేట్స్. వాళ్ల‌తో చ‌దువుకున్న రోజులంటే నాకెంతో ఇష్టం. ముగ్గురుం క‌లిసి తినేవాళ్లం. ఒక‌రికోసం ఒక‌రు ఇంట్లో చేసిన తిను ప‌దార్దాలు తెచ్చేవాళ్లం. ఇంటి విష‌యాల గురించి ఎప్పుడూ మాట్లాడుకునే వాళ్లం. కానీ ఏ రోజు సినిమాల్లో న‌టించాల‌ని అనుకోలేదు. చ‌దువుకు పూర్త‌య్యాక‌, నేను, యువ‌న్ ఒకేసారి సినిమాల్లోకి వ‌చ్చాం. ప‌ది సినిమాల వ‌ర‌కూ క‌లిసి ప‌నిచేసాం. మ‌హేష్ టాలీవుడ్ లో అడుగు పెట్టాడు.

త‌న‌తో క‌లిసి ప‌నిచేసే అవ‌కాశం ఇంకా రాలేదు. కానీ మ‌హేష్ సినిమాలన్నీ చూస్తుంటా. నా అభిప్రాయాలన్నీ చెబు తుంటా` అని అన్నారు. మ‌హేష్ బాల్య‌మంతా చెన్నైలో గ‌డిచిన సంగ‌తి తెలిసిందే. అత‌డి స్కూల్, కాలేజ్ లైఫ్ అంతా అక్క‌డే సాగింది. బాల న‌టుడిగానే తెరంగేట్రం చేసాడు. సూప‌ర్ స్టార్ కృష్ణ‌తో క‌లిసి ఎన్నో సినిమాలు చేసాడు. మ‌హేష్ కి చిన్న నాటి స్నేహితులంతా చెన్నైలో ఉన్నాడు.

పెద్దైన త‌ర్వాత స్నేహాలు పెద్ద‌గా చేయ‌లేదు. చిన్న నాటి స్నేహితుల‌తోనే అప్పుడ‌ప్పుడు ట‌చ్ లో ఉంటున్న‌ట్లు ఓ సంద‌ర్భంలో రివీల్ చేసారు. అలాగే ట‌చ్ లో ఉన్న స్నేహితుడు హీరో సూర్య అన్న సంగ‌తి తెలుస్తుంది. ఇంకా కోలీవుడ్ హీరోల్లో చాలా మంది మ‌హేష్ కి స్నేహితులు అయ్యే అవ‌కాశం ఉంది. మ‌హేష్ చ‌దువంతా చెన్నైలోనే పూర్త‌యింది. దీంతో పై చ‌దువులంటూ విదేశాల‌కు వెళ్ల‌కుండా సినిమాల్లోకి వ‌చ్చి న‌టుడిగా స్థిర‌ప‌డ్డారు.

Tags:    

Similar News