చిరంజీవికి రాజ్యసభ ఆఫర్?.. సుస్మిత క్లారిటీ

ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి చిరంజీవి గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే

Update: 2024-06-18 15:01 GMT

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఇది పేరు కాదు.. ఓ బ్రాండ్ అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు వేరే లెవెల్ లో అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. సినిమాలతో పాటు దాతృత్వ విషయంలో కూడా ఆయన ఎప్పుడూ ముందుంటారు. అందుకే చిరంజీవికి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా క్షణాల్లో నెట్టింట వైరల్ అయిపోతుంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ తెగ వినిపిస్తుంటాయి.

ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి చిరంజీవి గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో మంత్రిగా ప్రమాణం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత చిరు, పవన్ ను ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని మోదీ అభివాదం చేశారు. ఇద్దరి చేతులు పైకెత్తి మోదీ అభివాదం చేసిన సీన్.. మొత్తం వేడుకకే హైలెట్ గా నిలిచింది.

ఆ తర్వాత నుంచి చిరంజీవికి మోదీ రాజ్యసభ సీట్ ఆఫర్ చేశారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. మళ్లీ రంగంలోకి దిగుతారని టాక్ వినిపించింది. ఇప్పుడు ఈ ప్రచారంపై చిరు పెద్ద కూతురు సుస్మిత స్పందించింది. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేసింది. తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వచ్చిన పరువు వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడింది.

Read more!

ఆ సమయంలో చిరుకు రాజ్యసభ ఆఫర్ గురించి అడగ్గా క్లారిటీ ఇచ్చింది. అదేం లేదని స్పష్టం చేసింది సుస్మిత. తనకు అలాంటి విషయాలు అస్సలు తెలియవని చెప్పింది. అయితే ఇంట్లో అనేక విషయాలు గురించి డిస్కషన్స్ జరుగుతుంటాయని, కానీ ఈ మ్యాటర్ పై ఎప్పుడూ చర్చ జరగలేదని చెప్పింది. ప్రస్తుతం ఫ్యామిలీ అంతా పవన్ బాబాయ్ విన్నింగ్ మూమెంట్స్ ను ఎంజాయ్ చేస్తున్నామని తెలిపింది సుస్మిత.

మరోవైపు, సుస్మిత ప్రొడక్షన్ లో చిరంజీవి సినిమా చేస్తారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై కూడా సుస్మిత స్పందించింది. నాన్న గారితో సినిమా చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. మూవీస్ విషయంలో రామ్ చరణ్ తనకు సజెషన్స్ ఇస్తారని చెప్పింది. ఇప్పటికే తన బ్యానర్ పై వివిధ సినిమాలు, వెబ్ సిరీసులు నిర్మించిన సుస్మిత.. చిరుతో మూవీని ఎప్పుడు పట్టాలెక్కిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News