40 మంది మీడియా 60మంది ప్రొడక్షన్ కుర్రాళ్ల ముందు తిట్టేశాడు
మహేష్ భట్ తన ను అవమానించిన సంఘటన పై ఓపెనైంది.
సుస్మితా సేన్ 1994లో మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న భారతీయ నటికం మోడల్. అందాల పోటీ టైటిల్ హోల్డర్. సుస్మిత 18 సంవత్సరాల వయస్సులో మిస్ యూనివర్స్ పోటీ ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. 1996లో బాలీవుడ్ చిత్రం 'దస్తక్'లో తొలిసారిగా నటించింది. అటు పై 'బీవీ నం. 1', మై హూ నా, మైనే ప్యార్ క్యున్ కియా? వంటి చిత్రాలలో తన నటన కు పేరు తెచ్చుకుంది.
కానీ మహేష్ భట్ 1996 చిత్రం దస్తక్ లో తొలిసారిగా నటించడానికి ముందు కానీ 1994లో మిస్ యూనివర్స్ పోటీ లో గెలవడానికి ముందు కానీ.. సుష్ ఎప్పుడూ థియేటర్ లో నటించలేదు. ఆమెకు ఎలా నటించా లో తెలియదని విమర్శలొచ్చినా కానీ మహేష్ భట్ ఆమెకు అద్భుతమైన పాత్రలో నటించే అవకాశం కల్పించాడు. అయితే సుష్ కి అసలు నటనే రాదని మహేష్ భట్ తన ని వందమంది ముందు తీవ్రంగా అవమానించాడు. మహేష్ తన నటనా నైపుణ్యాన్ని పలువురు వ్యక్తుల ముందు ఎలా అవమానించాడో సుష్ ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో వివరించింది.
అదే సంఘటనను ట్వింకిల్ ఖన్నాతో షేర్ చేస్తూ... మహేష్ భట్ తన ను అవమానించిన సంఘటన పై ఓపెనైంది. మహేష్ భట్ అద్భుతమైన దర్శకుడని.. తన ని బహిరంగంగా అవమానించారని కూడా సుష్ గుర్తు చేసుకున్నారు. 40 మంది మీడియా వ్యక్తులు.. 20 మంది ప్రొడక్షన్ కుర్రాళ్ల ముందు అతడు తన ని తిట్టేశాడని ఆ సమయం లో ఏడవడం ప్రారంభించానని సుష్ తెలిపింది. తనకు తానుగా నటించలేనని తెలియజేసానని సుస్మితాసేన్ దర్శకుడికి చెప్పింది. అలాంటప్పుడు మీరు నన్ను దీని కోసం ఎందుకు ఎంపిక చేసుకున్నారు? అని కూడా ప్రశ్నించిందట. దానికి మహేష్ భట్ స్పందిస్తూ.. "క్యా లేకే ఆయే హో కెమెరా లో ఇలా మిస్ యూనివర్స్ ట్యాగ్ ని ప్లే చేస్తున్నాను" అన్నారట. తనను తాను రక్షించుకోవడానికి చర్య తీసుకోలేని నిస్సహాయత లో ఉండిపోయానని సుస్మితాసేన్ నాటి సంఘటనను గుర్తు చేసుకుంది.
తన ను దర్శకనిర్మాత మహేష్ భట్ తిట్టేయగా సుస్మితా సేన్ చాలా కోపం తెచ్చుకుంది. సెట్ నుండి బయట కు నడవడం ప్రారంభించింది. అయితే మహేష్ భట్ తన చేతి ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అతడి చేతి ని విసిరేసి.. ''మీరు నాతో అలా మాట్లాడకండి" అని కోపంగా హెచ్చరించింది. తాను వెళ్లిపోబోతుంటే మళ్ళీ అతడు చేతిని పట్టుకుని ''వెనక్కి రా.. కెమెరా ముందుకు వెళ్లు'' అని అన్నారట. అటుపై మరోసారి ప్రయత్నించి ఆమె పర్ఫెక్ట్ షాట్ ఇచ్చింది. అంతేకాదు మహేష్ భట్ దర్శకత్వ నైపుణ్యాల ను ఎంతో మెచ్చుకుంది. 1990లలో సహకథానాయికలతో కలత చెందిన దర్శకులెవరు? అనే విషయాల ను కూడా గుర్తు చేసుకున్నారు. సుస్మిత నటించిన తాళి సినిమా ప్రచారకార్యక్రమంలో ఇంటర్వ్యూలో పై సంగతులు ముచ్చటించింది.
ఆరంభం నటన రానే రాదనే విమర్శల్ని ఎదుర్కొన్నా.. తన నటనా జీవితం లో సుస్మితసేన్ ఎంతో పరిణతి చెందింది. నటిగా గణనీయమైన పురోగతిని సాధించింది. ఇప్పటికి చాలా ముందుకు వచ్చింది. మైనే ప్యార్ క్యున్ కియా, బీవీ నంబర్ 1, ఫిజా, ఆంఖేన్, మై హూ నా, బీవీ నంబర్ వన్ వంటి చిత్రాల లో కనిపించింది. 2010 తర్వాత ఆమె చిత్ర పరిశ్రమను విడిచిపెట్టింది. అయితే 2020లో ఆర్య అనే వెబ్ సిరీస్‌తో విజయం అందుకుంది. నటిగా అద్భుత ప్రదర్శనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీని లో సుస్మిత వర్కింగ్ ఉమెన్ పాత్రలో చిత్రీకరించింది.