సుస్మితా సేన్ పిల్లలిద్దిరి వయసు ఇప్పుడెంతో తెలుసా?
మాజీ మిస్ యూనివర్శ్ సింగిల్ పేరెంట్ గా కొన్నేళ్లగా దాతృత్వం చాటుతోన్న సంగతి తెలిసిందే.
మాజీ మిస్ యూనివర్శ్ సింగిల్ పేరెంట్ గా కొన్నేళ్లగా దాతృత్వం చాటుతోన్న సంగతి తెలిసిందే. రెనీ -అలీసా అనే ఇద్దరు అనాధ పిల్లల్ని దత్తత తీసుకుని కన్న తల్లి ప్రేమని పంచుతుంది. 2000 ఏడాదిలో పెద్ద కుమార్తె రెనీని దత్తత తీసుకోగా 2010లో ఆమె చిన్న కుమార్తె అలీసాను దత్తత తీసుకుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ వస్తే రెనీకి 25 ఏళ్లు కాగా, అలీసా వయస్సు 14 సంవత్సరాలు పూర్తవుతాయి.
ఈ సందర్భంగా సుస్మితాసేన్ సింగింల్ మదర్ అయినందుకు ఎంతో గర్వపడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుస్మితా సేను తన మాతృత్వ ప్రయాణం ఎలా సాగిందో వించరింది. `నా 48 వయసులో రెనీ - అలీసాలకు సింగిల్ పేరెంట్‌గా ఉండటం, ప్రేమను పంచడం గుర్తు చేసుకుంటే ఎంతో గర్వంగా ఉంది. ఓతల్లిగా తని తానే కీర్తించుకుంది. `కి ఆప్ కిత్నీ అచ్చి మా హైన్ (...తల్లిగా నువ్వు ఎంత బాగున్నావో) చెప్పాల్సిన వ్యక్తిని నేను కాదు. అది నాకు ముందే తెలుసు` అని రాసుకొచ్చింది.
అయితే ఈ ప్రయాణం ఎంతో సవాళ్లతో కూడుకున్నది. కానీ అంతకు మంచి సంతృప్తిని అందించిందని గర్వంగా చెప్పగలను. నేను ఒంటరిగా చేసినందున నాకు సవాల్ గా ఉంది. కానీ ప్రతీ రోజు ఏదో కొత్త విషయం పిల్లలిద్దరి ద్వారా నేర్చుకునే దాన్ని. నేర్చుకునే అవకాశం పిల్లలు ప్రతీ తల్లికి కల్పిస్తారని నాకు అప్పుడే అర్ధమైంది` అని తెలిపింది. సుస్మితా సేను 24 ఏళ్ల వయసులోనే పిల్లల్ని దత్తత తీసుకుంది.
అప్పటి నుంచి వాళ్ల బాధ్యతలు ఎంతో విధిగా నిర్వర్తించింది. వివాహ బంధానికి దూరంగా ఉన్నా పిల్లల్ని దత్తత తీసుకుని మాతృత్వాన్ని ఆస్వాదించింది. అలాగే సుస్మితా సేన్ సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటుంది. అయితే ఆ మధ్య లలిత్ మోది- సుస్మితా సేన్ వివాహం చేసుకుంటున్నట్లు ప్రకటించారు. కొన్నాళ్ల డేటింగ్ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనౌన్స్ చేసారు. కానీ ఆ బంధం పెళ్లివరకూ దారి తీయలేదు.