2.5 కోట్లు తీసుకుని మా హీరో ఉడాయించాడు! నిర్మాత
చిత్ర నిర్మాత సువిన్ కె. వర్కీ ఆగ్రహం వ్యక్తం చేసారు. 2.5 కోట్లు పారితోషికం తీసుకుని తన పనైన తర్వాత ఉడాయించాడని
మలయాళ నటుడు కుంచకో బోబన్ కథానాయకుడిగా సెన్నా హెగ్డే దర్శకత్వంలోని తెరకెక్కిన మలయాళ చిత్రం 'పద్మిణి' శుక్రవారం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమా మంచి టాక్ తో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర నిర్మాత సువిన్ కె. వర్కీ ఆగ్రహం వ్యక్తం చేసారు. 2.5 కోట్లు పారితోషికం తీసుకుని తన పనైన తర్వాత ఉడాయించాడని..సినిమా ప్రచారానికి సహకరించలేదని ఇన్ స్టా వేదికగా మండిపడ్డారు.
ఇలా చేయడం హీరోకి కొత్త కాదని.. గతంలో మరో ఇద్దరు నిర్మాతల్ని ఇలాగే ఇబ్బంది పెట్టాడని అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. 'హీరో భార్య నియమించిన మార్కెటింగ్ కన్సల్టెంట్ మా సినిమా రా ఫుటేజీని చూసి ప్రమోషన్స్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ రద్దు చేసారు.
ఇలాంటి అంశంపై ఎవరో ఒకరు ముందుకు వచ్చి మాట్లాడాలి. అందుకే నేను ధైర్యం చేసి మాట్లాడుతున్నాను. ఆ హీరో ఎలాంటి వాడో ఇప్పటికైనా చెప్పకపోతే నా లాగే ఇంకా చాలా మంది మోసపోతారు.
అదే హీరో ఆ సినిమాలో సహ నిర్మాతగా ఉండి ఉంటే ఇలాంటి సమస్య రాదు. ఆయన ఆ సినిమాని దగ్గరుండి మరీ ప్రమోట్ చేస్తాడు. ఇలాంటి అనుభవాన్ని కూడా చూసాను. తాను డబ్బు పెడితే ఒకలా..డబ్బు పెట్టకపోతే మరోలా ప్రవర్తిస్తాడా? ఎదుట వారి డబ్బులంటే అతనికి లెక్కలేదు. బయటి నిర్మాతలు అయితే మాత్రం పట్టించుకోడు. అతనికి సినిమా కంటే యూరోప్ లో స్నేహితులతో ఎంజాయ్ చేయడం ఇష్టం.
'పద్మిణి' ప్రేక్షకులను అలరిస్తోంది. మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అందకు సంతోషంగానూ ఉంది. కానీ ఈ సినిమాను సరిగ్గా ప్రమోషన్ చేయలేదని వస్తున్న ప్రశ్నలకు తాము సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. అందుకే మా హీరో రియల్ గా ఎలా ఉంటాడో చెప్పాను. సినిమా ని ప్రమోట్ చేయాల్సిన ప్రతీ నటుడిపై ఉంది. మా హీరో 25 రోజుల షూటింగ్ కోసం రూ.2.5 కోట్ల పారితోషికం తీసుకుని ఉడాయించాడు' అని ఆవేదన వ్యక్తం చేసారు.