శ్రీవిష్ణు స్వాగ్.. భవభూతి, రేవతి సంగతులు మీకోసం!

ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా ఏర్పడిన భారీ అంచనాల మధ్య అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది స్వాగ్ మూవీ.

Update: 2024-10-03 15:11 GMT

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సామజవరగమన, ఓం భీమ్ బుష్ చిత్రాలతో మంచి హిట్స్ అందుకున్న ఆయన.. ఇప్పుడు స్వాగ్ తో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. హసిత్ గోలి దర్శకత్వంలో వస్తున్న స్వాగ్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్ గా, దక్షా నగార్కర్, సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్, సునీల్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్నారు.

ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా ఏర్పడిన భారీ అంచనాల మధ్య అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది స్వాగ్ మూవీ. రీసెంట్ గా మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్.. ఆద్యంతం నవ్విస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీ విష్ణు ఖాతాలో మరో హిట్ పడునుందని అంతా అంచనా వేస్తున్నారు. అయితే సినిమాలో శ్రీవిష్ణు.. నాలుగు పాత్రల్లో కనిపించనున్నారు. అందులో భవభూతి ఒకటి. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా ఆ రోల్ పై భారీ బజ్ క్రియేట్ అయింది.

అయితే మేకర్స్ ప్రమోషన్స్ లో భాగంగా నేడు వరల్డ్ ఆఫ్ స్వాగ్- 22వ తరం ఎస్ఐ భవభూతి పేరుతో వీడియోను షేర్ చేశారు. అందులో హీరో శ్రీవిష్ణు, డైరెక్టర్ హసిత్ గోలి, ఎడిటర్ విప్లవ్.. పలు విషయాల గురించి మాట్లాడారు. 90స్లో ఉండే భవభూతి మూడ్ ను రీ క్రియేట్ చేశామని శ్రీ విష్ణు తెలిపారు. ఓ 25 ఏళ్ల తర్వాత భవభూతి వృద్ధాప్యానికి చేరుకుంటాడని, అందుకు తాను ప్రోస్తటిక్ మేకప్ వేసుకుని చేసిన క్యారెక్టర్ ను అంతా సినిమాలో చూస్తారని తెలిపారు.

ఆ రోల్ అందరికీ చాలా బాగా గుర్తుండిపోతుందని, ముఖ్యంగా మగవాళ్లు అందరూ కూడా భవభూతిని ఫేవరెట్ క్యారెక్టర్ గా చాలా రోజుల పాటు గుర్తు పెట్టుకుంటారని నమ్ముతున్నట్లు శ్రీ విష్ణు చెప్పారు. సమయాన్ని ఓ పరిధిగా తీసుకుని సినిమా తెరకెక్కించడం సవాలుగా అనిపించిందని, సరైన బ్యాలెన్స్ లో చిత్రాన్ని రూపొందించడం కష్టంగా అనిపించిందని ఎడిటర్ విప్లవ్ తెలిపారు. టీమ్ మధ్యలో ఉన్న కో ఆర్డినేషన్ వల్లే సినిమాను సక్సెస్ఫుల్ గా తెరకెక్కించామని చెప్పారు.

మరోవైపు, మీరా జాస్మిన్ మూవీ రేవతి పాత్రలో నటించారని హసిత్ తెలిపారు. ఆమె ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్ అని, ఎవర్ గ్రీన్ స్టార్ అని కొనియాడారు. ఆమెను ఎన్ని సార్లైనా స్క్రీన్ పై చూసేందుకు ఇష్టపడతారని తెలిపారు. మీరా జాస్మిన్ స్క్రీన్ పై కనిపిస్తున్నంత సేపు ఏదో తెలియని ఓ పాజిటివ్ ఫీల్ వస్తుందని, అంత హృద్యంగా ఆమె పాత్ర ఉంటుందని విష్ణు చెప్పారు. కథ చెప్పాక ఆమె ఎంతో ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యారని, చాలా ఇంట్రెస్ట్ తో క్యారెక్టర్ చేసేందుకు సిద్ధమయ్యారని హసిత్ వెల్లడించారు. మీరా జాస్మిన్ సినిమాకు ఆత్మ వంటి వారని తెలిపారు.

Full View
Tags:    

Similar News