స్వాగ్ @శ్రీవిష్ణు.. కింగ్ ఆఫ్ కంటెంట్
అయితే శ్రీవిష్ణు కెరీర్ లో స్వాగ్ ఓ స్పెషల్ మూవీ అనే చెప్పాలి. ఎందుకంటే ఏ నటుడు అయినా డ్యూయల్ రోల్ చేయడానికి కాస్త ఇబ్బంది పడతారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఇప్పుడు హీరోగా దూసుకుపోతున్నారు శ్రీవిష్ణు. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన కాన్సెప్టులు ఎంచుకుంటూ మెప్పిస్తున్నారు. ఆయన సినిమా వస్తుందంటే చాలు.. ప్రేక్షకుల్లో ఓ నమ్మకం కచ్చితంగా ఏర్పడుతుంది. మంచి కంటెంట్ ఉంటుందని అంతా ఫిక్స్ అయిపోతారు. అందుకే కింగ్ ఆఫ్ కంటెంట్ అనే ట్యాగ్ ఇచ్చేశారు. ఆ ట్యాగ్ తగ్గట్లు ఆయన కూడా సినీ ప్రియులను ఓ రేంజ్ లో అలరించారు.. అలరిస్తున్నారు కూడా.
గతేడాది హిలేరియస్ ఎంటర్టైనర్ సామజవరగమనతో మంచి హిట్ ను అందుకున్న శ్రీవిష్ణు.. ఈ ఏడాదిలో ఇప్పటికే ఓం భీమ్ బుష్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ప్రయోగాత్మక చిత్రం స్వాగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యంగ్ డైరెక్టర్ హసిత్ గోలి దర్శకత్వం వహించిన ఆ మూవీ.. నిన్ననే థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పటికే హసిత్, శ్రీవిష్ణు కాంబోలో రాజ రాజ చోర మూవీ రాగా.. తాజాగా మరోసారి వారి కాంబినేషన్ రిపీట్ అయింది.
అయితే శ్రీవిష్ణు కెరీర్ లో స్వాగ్ ఓ స్పెషల్ మూవీ అనే చెప్పాలి. ఎందుకంటే ఏ నటుడు అయినా డ్యూయల్ రోల్ చేయడానికి కాస్త ఇబ్బంది పడతారు. రెండు కంటే ఎక్కువ రోల్స్ ను చేసేందుకు ముందుకు రారు. కానీ శ్రీవిష్ణు.. స్వాగ్ లో ఐదు విభిన్నమైన పాత్రలు పోషించారు. తన యాక్టింగ్ టాలెంట్ ను మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. నటుడిగా తన ఫ్లెక్సిబిలిటీ చూపిస్తూ రకరకాల గెటప్స్ లో అలరించారు. పాత్రకు పాత్రకు వైవిధ్యాన్ని చూపిస్తూ ఓ రేంజ్ లో సినీ ప్రియులను మెప్పించారు.
భవభూతి, శ్వాగణిక రాజు, సింగరేణి అలియాస్ సింగ పాత్రలు శ్రీవిష్ణుకు కొట్టిన పిండిలాగే అనిపిస్తాయి. మిగతా పాత్రలు, గెటప్పుల కోసం ఆయన పడిన కష్టం తెరపై చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆయన పాత్రల్లో ఒదిగిపోయిన విధానంతో పాటు యాక్టింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దీంతో ఇప్పుడు పెద్ద ఎత్తున శ్రీవిష్ణుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. విలక్షణ నటుడు కమల్ హాసన్ కు జూనియర్ అంటూ పొగుడుతూ సందడి చేస్తున్నారు.
ఇక సినిమా విషయానికి వస్తే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు. యంగ్ బ్యూటీ రీతూ వర్మ హీరోయిన్ గా నటించారు. సీనియర్ బ్యూటీ మీరా జాస్మిన్, దక్షా నగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు. మరి వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన స్వాగ్ చిత్రాన్ని మీరు చూశారా?