ప్రభాస్ vs ఆర్షద్.. కల్కి నిర్మాత ఏమన్నారంటే..

‘‘కల్కి 2898 AD’’ సినిమాపై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

Update: 2024-08-29 10:32 GMT

‘‘కల్కి 2898 AD’’ సినిమాపై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ప్రభాస్ పాత్ర గురించి అతను జోకర్ అంటూ కామెంట్ చేయడం వలన అభిమానులు, చిత్రబృందం ఆగ్రహం వ్యక్తం చేసింది, దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ విషయంపై సున్నితంగా స్పందించిన్నప్పటికి మరికొందరు నటీనటులు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అయితే నాగ్ అశ్విన్ మాత్రం నెగిటివ్ గా రియాక్ట్ కాకుండా హుందాగా సమాధానం ఇచ్చారు.

అదే సమయంలో వాదనలతో వెనక్కు వెళ్లకుండా మనం ఒకే ఇండస్ట్రీకి చెందిన వారమని గుర్తుచేసిన తీరు అందరిని ఆలోచింపజేసింది. ఇక ఇటీవల, కల్కి నిర్మాత స్వప్నదత్ కూడా ఈ అంశంపై స్పందించారు. ఆమె మాట్లాడుతూ.., ‘‘ప్రభాస్ పాత్ర సినిమాకు ఎంత ముఖ్యమో ఇప్పటికే ప్రేక్షకులకు అర్థమైంది. అందుకే మేము ఎలాంటి మౌనంగా ఉన్నాం. నాగ్ అశ్విన్ కూడా ఎంతో సున్నితంగా, అర్థవంతంగా స్పందించారు.

అర్షద్ ఇంటికి ‘‘కల్కి’’ బొమ్మలను పంపిస్తానని చెప్పి, ప్రశాంతంగా మాట్లాడి ఉంటే బాగుండేదన్న విషయాన్ని వెల్లడించడం అతని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది’’ అని తెలిపారు. ఇక, అర్షద్ చేసిన వ్యాఖ్యలపై మానవతా దృక్పథంతో వ్యవహరించడం నాగ్ అశ్విన్ కు మాత్రమే సాధ్యమని అనేకమంది అభిప్రాయపడ్డారు. ‘‘కల్కి 2898 AD’’లో ప్రభాస్ పాత్రను తక్కువ చేయడం కేవలం వివాదం మాత్రమే కాకుండా, సౌత్-నార్త్ మధ్య ఉన్న విభేదాలను మళ్లీ తెరపైకి తెచ్చింది.

నాగ్ అశ్విన్ మాత్రం ఈ విభేదాల నుండి దూరంగా ఉండి, మిగతా ఇండస్ట్రీలతో స్నేహపూర్వక వాతావరణాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నారని చెప్పవచ్చు. మరోవైపు, ‘‘మా’’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఈ విషయంపై కఠినంగా స్పందిస్తూ, అర్షద్ వ్యాఖ్యలు సరిగా లేవని, ఇవి ప్రభాస్‌కు వ్యతిరేకతను ప్రోత్సహించేలా ఉన్నాయని అన్నారు.

అతను బాలీవుడ్ ఆర్టిస్టుల అసోసియేషన్‌కి లేఖ కూడా రాశారు, అర్షద్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. అలాగే యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా ఆర్షద్ కామెంట్స్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇక ప్రభాస్ సినిమాలను అనే ముందు అర్షద్ స్థాయి ఏమిటో తెలుసుకోవాలి అని అనవసరంగా కామెంట్స్ చేసి హైలెట్ అవ్వాలని చూడకూడదు అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News