'ఛావా' కారణంగా నాగ్‌పూర్ అల్లర్లు.. టెన్షన్‌లో నటి!
ఇప్పుడు స్వరా 'ఎక్స్'లో పోస్ట్ చేసిన రెండు ట్వీట్లు దుమారం రేపుతున్నాయి.;

చాలా కాలంగా పరిశ్రమకు దూరంగా ఉన్న బాలీవుడ్ నటి స్వర భాస్కర్ ఇండస్ట్రీలో పలు అంశాలపై నిరంతరం సోషల్ మీడియాల్లో తన అభిప్రాయం చెబుతున్నారు. వీటిలో కొన్ని వివాదాల్ని కూడా మోసుకొస్తున్నాయి. ఇప్పుడు స్వరా 'ఎక్స్'లో పోస్ట్ చేసిన రెండు ట్వీట్లు దుమారం రేపుతున్నాయి. వీటిలో నాగ్‌పూర్ అల్లర్లకు 'ఛావా' సినిమానే కారణం అని ఒక ట్వీట్ లో పేర్కొనగా, మరొక ట్వీట్‌లో నటుడు కునాల్ కమ్రాను ప్రశంసిస్తూ, ఏక్‌నాథ్ షిండే కి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం హాట్ టాపిగ్గా మారింది.
స్వరా పోస్ట్‌లలో ఒకదానిలో ''ఛావా చిత్రం రెచ్చగొట్టేది. విక్కీ కౌశల్ - నిర్మాతలు నాగ్‌పూర్ అల్లర్లకు బాధ్యులు. ఈ చిత్రాన్ని భారతదేశం అంతటా నిషేధించాలి'' అని రాశారు. అదే సమయంలో రెండవ ట్వీట్‌లో ''కునాల్ కమ్రా కామెడీ షో ఒక కళ'' అని రాశారు. షిండే మద్దతుదారులే ఈ విధ్వంసానికి బాధ్యులు! అని కూడా ట్వీట్ లో రాసారు. ఈ రెండు ట్వీట్లు ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఇవి ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అయితే నెటిజనుల నుంచి ఊహించని విమర్శలు ఎదురవ్వడంతో స్వరా తాజాగా దీనిపై స్పందించారు. ఈ ట్వీట్‌లను తాను చేయలేదని, ఇవన్నీ నకిలీ ట్వీట్లు అని పేర్కొన్నారు. దయచేసి వాస్తవాలను తెలుసుకోండి అని కూడా స్వరా అభ్యర్థించారు.
ఫేక్ పోస్ట్‌లకు సంబంధించిన కొన్ని స్క్రీన్‌షాట్‌లను స్వరా షేర్ చేసారు. మూర్ఖపు రైటిస్టులు మళ్ళీ వారు చేయగలిగినది చేయడం ప్రారంభించారు.. నకిలీ ఫోటోలు, మీమ్‌లను ప్రచారం చేస్తున్నారు'' అని రాసింది. స్వర భాస్కర్ పోస్ట్ కి కొందరు మద్ధతుగా నిలిచారు. వారంతా నకిలీ ఫోటోతో స్వరాను సోషల్ మీడియాల్లో బ్యాడ్ చేస్తున్నారని రాసారు.. నిజమైన ప్రొఫైల్ ఫోటో ఇది కాదు. ఈ పోస్ట్‌లోని ఫోటోకి స్వరా ఒరిజినల్ ప్రొఫైల్ ఫోటోకి మధ్య చాలా తేడా ఉందని కూడా నెటిజనులు విశ్లేషించారు. అయితే స్వరాను ఏదో ఒక రకంగా ఇరకాటంలో పెడుతూ కొందరు చాలా గందరగోళం సృష్టిస్తున్నారు.