నేను రిచ్‌గా చనిపోవాలని అనుకోను : తాప్సి

రెగ్యులర్‌గా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే తాప్సి ఇటీవల వారసుల విషయంలో షాకింగ్‌ వ్యాఖ్యలు చేసింది.

Update: 2024-11-28 10:30 GMT

సౌత్‌లో హీరోయిన్‌గా పరిచయం అయ్యి ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకుని వరుసగా సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ తాప్సి. బాలీవుడ్‌లో మొదట లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన తాప్సి ఇప్పుడు హీరోలకు జోడీగా సినిమాలు చేస్తోంది. బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్ ఖాన్‌తో కలిసి డుంకీ సినిమాలో నటించడం ద్వారా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ, స్కిన్‌ షో కి కాస్త దూరంగా ఉంటున్న తాప్సి ముందు ముందు మరిన్ని మంచి హిందీ సినిమాలతో వస్తానంటోంది.

రెగ్యులర్‌గా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే తాప్సి ఇటీవల వారసుల విషయంలో షాకింగ్‌ వ్యాఖ్యలు చేసింది. తాను కెరీర్‌ ఆరంభంలో అవకాశాల కోసం చాలా ఇబ్బంది పడ్డాను అని, వారసులకు దక్కినంత ఈజీగా ఆఫర్లు బయటి నుంచి వచ్చిన వారికి ఆఫర్లు లభించవు అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటికీ బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ ఉన్న ఈ అమ్మడు ముందు ముందు సౌత్‌ సినిమాలోనూ నటించాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. తెలుగులో ఈమె సినిమాలు చేయక చాలా కాలం అయింది. మంచి ఆఫర్లు వస్తే నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాప్సి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేద వాడిగా చావడం నీ తప్పు అంటూ చాలా మంది ఆర్థిక సలహాలు ఇచ్చే వారు, పెద్ద వారు చెబుతూ ఉంటారు. కానీ తాప్సి మాత్రం తాను రిచ్‌గా చనిపోవాలని కోరుకోవడం లేదు. కానీ ఉన్నంత కాలం చాలా రిచ్‌గా ఉండాలని మాత్రం ఆమె కోరుకుంటుంది. అంటే తాను సంపాదించింది తన తర్వాత తరాలకు కాకుండా, తానే రిచ్‌ గా జీవితాన్ని అనుభవించాలని భావిస్తుంది. అందుకోసం ఆమె ఉన్నంత కాలం చాలా సంతోషంగా, సుఖంగా ఉండటం కోసం భారీగా ఖర్చు చేయాలని అనుకుంటుందట.

చాలా మంది సెలబ్రిటీలు ఎంత సంపాదించినా సింపుల్‌గా జీవితాన్ని గడుపుతూ తదుపరి తరాలకు తమ ఆస్తులను కూడబెడుతూ ఉంటారు. కానీ తాప్సి మాత్రం తదుపరి తరాల వారు తమ కష్టంతో ఆస్తులను సంపాదించుకోవలి, అంతే తప్ప మనం కష్టపడి వారికి ఇచ్చేది ఏంటి అన్నట్లుగా విభిన్నమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంది. నిజంగానే మనం ఇబ్బందులు పడి, మన తదుపరి తరాలకు డబ్బు సంపాదించి పెట్టాల్సిన అవసరం ఏంటని, మనం రిచ్‌గా ఉంటే చాలు, తదుపరి తరాల వారు కష్టపడి రిచ్‌గా అవుతారు అంటూ తాప్సి వ్యాఖ్యలను సమర్ధిస్తూ ఉన్న వారు చాలా మంది ఉన్నారు.

Tags:    

Similar News