హీరోలంతా కలిసి హీరోయిన్ల స్వేచ్ఛని హరిస్తున్నారా?
కొంత మంది హీరోలు ట్రెండింగ్ లో ఉన్న వారిని తీసుకుంటారని, మరికొంత మంది తమని డామినేట్ చేయని వాళ్లను తీసు కుంటారని ఆరోపించింది
ఇటీవలే తాప్సీ బాలీవుడ్ పరిశ్రమ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సినిమాల్లో హీరోయిన్లను ఎంపిక చేసేది దర్శకులు కాదు...అందులో నటించే స్టార్ హీరోలే అంది. కొంత మంది హీరోలు ట్రెండింగ్ లో ఉన్న వారిని తీసుకుంటారని, మరికొంత మంది తమని డామినేట్ చేయని వాళ్లను తీసు కుంటారని ఆరోపించింది. వ్యక్తిగతంగా తన అనుభవాలు సైతం పంచుకుంది.
`డంకీ` సినిమాలో నటిచినా తనకు తగ్గ పారితోషికం చిత్ర నిర్మాతలు ఇవ్వలేదని..కానీ ఈ సినిమాకు తాను భారీగా పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోందని అంది. `జూడ్వా-2` పారితోషికం విషయంలో కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ తీరును, తనకెదురైన అనుభవాలపై ఆ రకంగా ఓపెన్ అయింది. దీంతో ఇప్పుడీ వ్యాఖ్యలు బాలీవుడ్ మీడియా సహా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారినట్లు సమాచారం.
బాలీవుడ్ ఇండస్ట్రీని ఉద్దేశించి కొన్ని రకాల పోస్టులు సైతం వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ అన్నది మేల్ డామినేషన్ ఇండస్ట్రీ అని, అక్కడ నటీనటులపై వివక్ష చూపిస్తారని చాలా కాలంగా ఉన్న ఆరోపణే. చాలామంది స్టార్ హీరోయిన్లు సైతం ఈ అంశాన్ని పలు సందర్భాల్లో ప్రస్తావించారు. హీరోలతో సమాన పారితోషికాలు ఇవ్వరని..సెట్లో సౌకర్యాల విషయంలో, గౌరవ మర్యాదల విషయంలోనూ కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఎండార్స్ మెంట్స్ విషయంలోనూ హీరోల ఆధిపత్యం చెలాయిస్తారంది. తాము సూచించిన బ్రాండ్లను మాత్రం ఎండార్స్ చేయాలని...కొత్తగా సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ సైత ఉండదనట్లు వ్యాఖ్యానించింది. మొదట్లో అది తనను నిరాశపరిచినప్పటికీ కాలక్రమంలో అన్ని అలవాటు చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది.