నెట్ ఫ్లిక్స్ - తాప్సి.. మరోసారి అదే ప్లాన్

2020-21 మధ్యకాలంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండేది. దేశవ్యాప్తంగా ఉన్న లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ అన్ని మూతబడ్డాయి

Update: 2024-08-06 13:30 GMT

2020-21 మధ్యకాలంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండేది. దేశవ్యాప్తంగా ఉన్న లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ అన్ని మూతబడ్డాయి. అదే సమయంలో ఓటీటీపై పబ్లిక్ అటెన్షన్ పెరిగింది. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటి ఇంటర్నేషనల్ ఓటీటీ స్ట్రీమింగ్ యాప్స్ లలో కంటెంట్ ని ప్రేక్షకులు ఇంట్లో చూడటం మొదలు పెట్టారు. దీంతో సాధారణ కథలకి కూడా ఆ సమయంలో మంచి వ్యూవర్ షిప్ వచ్చింది. కొద్దిగా బాగున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు అయితే ట్రెండింగ్ లో చాలా కాలం కొనసాగాయి.

అప్పుడు ఓటీటీలకి లభించిన ఆదరణ స్థిరంగా కొనసాగుతోంది. ఓటీటీలు కూడా డిఫరెంట్ కథలతో సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మించడం మొదలు పెట్టాయి. ఒరిజినల్స్ పేరుతో నిర్మించిన ఈ కంటెంట్ లకి ఈ మధ్యకాలంలో సరైన ఆదరణ లభించడం లేదు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఓటీటీ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ ఇండియన్ సినిమాలని భారీ ధరలు చెల్లించి కొనుగోలు చేస్తోంది. అయితే నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ గా తెరకెక్కిస్తున్న కథలు ప్రేక్షకాదరణ సొంతం చేసుకోవడంలో విఫలం అవుతున్నాయి.

నెట్ ఫ్లిక్స్ లో ఈ మధ్య బాగా హిట్ అయిన వెబ్ సిరీస్ అంటే సంజయ్ లీలా భన్సాలీ హీరామండీ. మూవీస్ పరంగా మహారాజ్ కొద్దిగా ఆకట్టుకుకుంది. వైల్డ్ వైల్డ్ పంజాబ్, కిల్లర్ సూప్, ఆర్చీస్ మరియు మర్డర్ ముబారక్ వంటివి ప్రేక్షకులని ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. వీటికి ఆదరణ వచ్చిన మరీ గొప్పగా అయితే రాలేదు. నెట్ ఫ్లిక్స్ మాత్రం మళ్ళీ ఒరిజినల్ కంటెంట్ తో పుంజుకోవాలని అనుకుంటుంది. కంటెంట్ సెలక్షన్ అనేది వ్యూవర్ షిప్ పెంచడంలో కీలక భూమిక పోషిస్తుంది.

కరోనా టైంలో నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకులని బాగా ఎట్రాక్ట్ చేసిన మూవీ హసీనా దిల్ రూబా. మర్డర్ థ్రిల్లర్ జోనర్ లో తాప్సి లీడ్ రోల్ లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీనికి సీక్వెల్ గా ప్యార్ ఆయీ హసీన్ దిల్‌రూబా మూవీ ఆగష్టు 9న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో కూడా తాప్సికి జోడీగా విక్రాంత్ మెస్సి నటించారు.

మరి ఈ మూవీ ఎలాంటి సక్సెస్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాప్సికి కూడా గత కొంతకాలంలో ఆశించిన స్థాయిలో సక్సెస్ లు లేవు. ఈ కొత్త సినిమాపై ఆమె చాలా హోప్స్ పెట్టుకుంది. కరోనా సమయంలో ప్రేక్షకులని ఆకర్షించిన హసీనా దిల్ రూబా తరహాలో ఈ సీక్వెల్ కూడా థ్రిల్లర్ జోనర్ లోనే సిద్ధమైంది. నెట్ ఫ్లిక్స్ కి ఈ మూవీ ఏ మేరకు వ్యూవర్ షిప్ ని అందిస్తుందనేది వేచి చూడాలి.

Tags:    

Similar News