ఇది నాకు రెండో రౌండ్.. వార్ కు సిద్ధంగా ఉన్నా
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి బాగా ఎక్కువగా సోకుతుంది. మన దేశంలో కూడా క్యాన్సర్ తో బాధ పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది;

ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి బాగా ఎక్కువగా సోకుతుంది. మన దేశంలో కూడా క్యాన్సర్ తో బాధ పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. చిన్నా, పెద్దా వయసుతో తేడా లేకుండా ఈ సమస్య అందరినీ ఇబ్బంది పెడుతుంది. మరీ ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ ఎక్కువగా వస్తోంది.
ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకుని, వ్యాధిని గుర్తిస్తే క్యాన్సర్ నుంచి బయటపడొచ్చు. బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య, డైరెక్టర్ తహీరా కశ్యప్ మరోసారి క్యాన్సర్ బారిన పడినట్టు తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
ఎన్ని సమస్యలు వచ్చినా వాటికి ఎదురెళ్లి ఎదుర్కోవాలని చెప్తోన్న తహీరా కశ్యప్ వీలైనంత మేరకు హెల్త్ పై ఫోకస్ చేసి జాగ్రత్త పడాలని అభిమానులకు సూచించింది. తహీరా పోస్ట్ పై పలువురు సెలబ్రిటీలు రెస్పాండ్ అయ్యారు. తహీరా భర్త ఆయుష్మాన్ ఖురానా ఆ పోస్ట్ కు స్పందిస్తూ మై హీరో.. నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అంటూ ధైర్యాన్నిచ్చారు.
గతంలో 2018లో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన తహీరా అప్పుడు దాన్ని జయించి క్యాన్సర్ నుంచి బయటపడింది. కానీ మళ్లీ మరోసారి ఇప్పుడు తహీరా క్యానర్ బారిన పడినట్టు స్వయంగా తెలిపింది. ఏడేళ్ల నుంచి రెగ్యులర్ చెకప్‌లు, మెమోగ్రామ్‌లు చేయించుకోవాలని ప్రతీ ఒక్కరికీ చెప్తూ ఉంటా. అయినా ఇది నాకు రెండో రౌండ్. మరో యుద్ధానికి నేను సిద్ధంగా ఉన్నా, ఈ వ్యాధితో పోరాడాలనుకుంటున్నా. నాకు మళ్లీ క్యాన్సర్ వచ్చిందని చెప్పడానికి నేనేమీ మొహమాట పడటం లేదని తహీరా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.