న‌చ్చితే త‌మ‌న్నాకి నిడివితో ప‌నేంలేదు!

సాధార‌ణంగా హీరోయిన్ ఇమేజ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఇలాంటి అవ‌కాశాలు వ‌చ్చినా? మ‌రి క్ష‌ణం తీరిక లేకుండా ఉండేంత బిజీగా ఉండ‌రు.

Update: 2024-09-06 07:45 GMT

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా సెకెండ్ ఇన్నింగ్స్ కూడా దేదీప్య‌మానంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. గెస్ట్ రోల్స్..స్పెష‌ల్ అప్పిరియ‌న్స్...ఐటం పాట‌ల్లో న‌టిస్తూ స‌త్తా చాటుతుంది. ఈ ర‌క‌మంగా ఏ న‌టి లేనంత బిజీగా త‌మ‌న్నా మాత్రమే ఉంది అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. సాధార‌ణంగా హీరోయిన్ ఇమేజ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఇలాంటి అవ‌కాశాలు వ‌చ్చినా? మ‌రి క్ష‌ణం తీరిక లేకుండా ఉండేంత బిజీగా ఉండ‌రు.

కానీ త‌మ‌న్నా మాత్రం వాళ్లంద‌రికీ భిన్నం. హీరోయిన్ గా కొన‌సాగినంత కాలం ఎంత బిజీగా ఉందో? ఇప్ప‌టికీ అంతే బిజీగా క‌నిపిస్తోంది. అయితే అందుకు త‌మ‌న్నా ఇలా ఉన్న ఈ గొప్ప ల‌క్ష్మ‌ణాన్ని కూడా ఓ కార‌ణంగా చెప్పొచ్చు. తాను ఏ సినిమా ఎంపిక చేసుకున్నా? పాత్ర నిడివి ఎంత ఉంది? అన్న‌ది మాత్రం చూడ‌ద‌ట‌. తెర‌పై కనిపించినంత సేపు ఆ పాత్ర ఎలా ఉంటుంది? అన్న ది ఒక్క‌టే దృష్టిలో పెట్టుకుని సినిమాకి సైన్ చేస్తోందిట‌.

ఇప్ప‌టివ‌ర‌కూ ఇదే విధానంలో సినిమాలు చేసాన‌ని..ఇప్పుడు ఇదే ప‌ద్ద‌తిలో క‌మిట్ అవుతున్న‌ట్లు తెలిపింది. ఇంత‌వ‌ర‌కూ ఏ సినిమా విష‌యంలోనూ నిడివిని ఎప్పుడూ ప‌ట్టించుకోలేదంది. కేవ‌లం నిడివిని మాత్ర‌మే ప్రామాణికంగా తీసుకుని సినిమాలు చేయాలంటే? క‌ష్ట‌మైన ప‌నిగానే ఉంటుంద‌ని అభిప్రాయ ప‌డింది. పైగా ఈ మ‌ధ్య కాలంలో అభిమానులు న‌న్ను ప్ర‌త్యేక పాత్ర‌ల్లో ..ఐటం గాళ్ల్ గా చూడ‌టానికి ఎక్కు వ‌గా ఇష్ట ప‌డుతున్నారు.

ఈ నేప‌థ్యంలో వీలైనంత వ‌ర‌కూ అదే త‌ర‌హాలో సినిమాలు చేస్తున్న‌ట్లు తెలిపింది. అలాగే లేడీ ఓరియే టెండ్ సినిమాలు కూడా చేస్తున్నాన‌ని తెలిపింది. ప్ర‌స్తుతం త‌మ‌న్నా చేతిలో చాలా సినిమాలున్నాయి. అవ‌న్నీ ఇదే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఇటీవ‌లే `స్త్రీ-2` లో ఐటంగాళ్ గా మెప్పించిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News