బొద్దుగా ఉన్నావు కానీ.. త‌మ‌న్నాపై కామెంట్

`జైల‌ర్`లో `కావాలా...` ఎంత‌టి ట్రెండ్‌సెట్ట‌రో తెలిసిందే. ఈ పాట డిజిట‌ల్ గా సెన్సేష‌న్ అయింది.

Update: 2024-12-04 10:30 GMT

`జైల‌ర్`లో `కావాలా...` ఎంత‌టి ట్రెండ్‌సెట్ట‌రో తెలిసిందే. ఈ పాట డిజిట‌ల్ గా సెన్సేష‌న్ అయింది. సోష‌ల్ మీడియా, యూట్యూబ్‌లో అద్భుత‌మైన వీక్ష‌ణ‌లు ద‌క్కించుకున్న ఈ ప్ర‌త్యేక గీతం కేవ‌లం మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా అందం నృత్యం కార‌ణంగానే ఇంత‌టి ప్ర‌జాద‌ర‌ణ పొందింది. అంతేకాదు.. త‌మ‌న్నా భారీ అందాల విందుకు యువ‌త‌రం దాసోహం! అంటూ మీడియా సైతం కీర్తించింది.

బ్లాక్ బ‌స్ట‌ర్ `స్త్రీ 2`లో `ఆజ్ కీ రాత్‌..`తోను మ‌ళ్లీ అంత‌టి వేవ్ సృష్టించింది త‌మ‌న్నా. వ‌రుస సంవ‌త్స‌రాల్లో త‌మ‌న్నా కీర్తిని పెంచిన గీతాలివి. ప్ర‌త్యేక పాట‌లే అయినా త‌న ఇమేజ్ మ‌రింత పెర‌గ‌డానికి ఇవి స‌హ‌క‌రించాయి. అయితే 34 వ‌య‌సు త‌మ‌న్నా.. త‌న అధిక బ‌రువును పాట‌ల్లో ప్ర‌దర్శించ‌డంపైనా నెటిజ‌నుల్లో వాద‌న‌లు సాగాయి. ముఖ్యంగా జైల‌ర్ `కావాలా..` పాట‌లో త‌మ‌న్నా భాటియా బొద్దుగా ముద్దుగా క‌నిపించింద‌ని అభిమానులు భావించారు. ఇదే విష‌యాన్ని ప్ర‌స్థావించిన ఓ ఏజ్డ్ మ‌హిళ పార్టీలో త‌న‌పై చే చేసిన వ్యాఖ్య మేల్కొలిపింద‌ని తెలిపారు.

ఈ విష‌యాల‌న్నీ తాజా ఇంట‌ర్వ్యూలో రివీల్ చేసింది మిల్కీ. తాను బొద్దుగా ఉన్నానని అంగీక‌రించ‌డ‌మే కాదు.. త‌దుప‌రి `ఆజ్ కీ రాత్`లో ఇంకా అందంగా క‌నిపించేందుకు త‌న‌ను తాను మెరుగు ప‌రుచుకున్నాన‌ని తెలిపింది. ఏది ఏమైనా కానీ ఎవ‌రైనా ఏదైనా విమ‌ర్శిస్తే దానిని అనుస‌రించి, త‌మ‌ను తాము మెరుగుప‌రుచుకునే న‌టీమ‌ణుల‌కు ఎప్పుడూ మంచి అవ‌కాశాలొస్తాయ‌ని రంగుల ప్ర‌పంచంలో నిరూప‌ణ అయింది.

కేవ‌లం త‌మ‌న్నా మాత్ర‌మే కాదు సోనాక్షి సిన్హా, న‌ర్గీస్ ఫ‌క్రీ, హ్యూమా ఖురేషి లాంటి భామ‌లు బొద్దుగా ఉన్నా కానీ, సౌక‌ర్య‌వంత‌మైన దుస్తుల్లో ఫ్యాష‌నిస్టాలుగా నిరూపించుకున్నారు. త‌మ‌న్నా బొద్దందం కూడా ఇప్పుడు యువ‌త‌రంలో స్ఫూర్తి నింపుతోంది. త‌దుప‌రి సికందర్ కా ముఖద్దర్‌లో త‌మ‌న్నా క‌నిపించ‌నుంది.

Tags:    

Similar News